2007వ సంవత్సరంలో దర్శకుడిగా కెరీర్ ను ఆరంభించిన వంశీ పైడిపల్లి ఇప్పటి వరకు కేవలం అయిదు సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించాడు. అయిదవ సినిమా అయిన 'మహర్షి' ఇంకా విడుదల కాలేదు. రెండు మూడు సంవత్సరాలకు ఒక సినిమా చొప్పున చేస్తున్న వంశీ పైడిపల్లి మహర్షి చిత్రం తర్వాత అయినా వెంటనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడని భావిస్తే 'మహర్షి' చిత్రం తర్వాత కూడా తదుపరి చిత్రానికి రెండేళ్ల వరకు సమయం తీసుకునేలా కనిపిస్తున్నాడు. వంశీ పైడిపల్లి 'మహర్షి' చిత్రం తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటికే రామ్ చరణ్ తో 'ఎవడు' అనే చిత్రాన్ని తెరకెక్కించి సక్సెస్ అయిన దర్శకుడు వంశీ మరో సారి చరణ్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమాను చేస్తున్న రామ్ చరణ్ ఆ తర్వాత చేయబోతున్న సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తాడని సమాచారం అందుతోంది. అంతకు ముందు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ తర్వాత మూవీ ఉంటుందని అనుకున్నారు. కాని తాజాగా వంశీ పైడిపల్లి పేరు వార్తల్లో వస్తోంది.
రామ్ చరణ్ తో సినిమా తీయాలంటే వంశీ పైడిపల్లి మరో రెండు సంవత్సరాలు వెయిట్ చేయాల్సి రావచ్చు అంటున్నారు. ప్రస్తుతం చేస్తున్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీ వచ్చే ఏడాది జులైలో విడుదల కాబోతుంది. ఆ తర్వాత కొద్దిగా సమయం తీసుకుని చరణ్ ఆ తర్వాత సినిమాను మొదలు పెడతాడు. అంటే వచ్చే ఏడాది చివర్లో వంశీ పైడిపల్లికి చరణ్ డేట్లు ఇస్తాడు. వంశీ ఏ సినిమాను అయినా కనీసం సంవత్సరం పాటు చెక్కుతాడు. అందుకే చరణ్, వంశీ పైడిపల్లి సినిమా వచ్చేప్పటికి రెండేళ్లు పట్టవచ్చు, మూడేళ్లు పట్టవచ్చు. అంటే మహర్షి విడుదలైన తర్వాత మళ్లీ రెండు మూడేళ్ల వరకు వంశీ పైడిపల్లి మూవీ ఉండదన్నమాట. మరీ ఇంత స్లోగా అయితే కెరీర్ మొత్తంలో కూడా పది సినిమాలైనా వంశీ ఖాతాలో ఉంటాయా అనేది అనుమానమే. చరణ్ తో మూవీ కంటే ముందు మరో సినిమాను ఈ దర్శకుడు చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని వంశీ మాత్రం హడావుడి సినిమాలపై ఆసక్తి చూపించడు. మెల్లగానే చేసుకుంటూ వెళ్దాం అనుకుంటాడు. అందుకే కెరీర్ ఆరంభం అయ్యి 12 ఏళ్లు అయినా ఇంకా అయిదు సినిమాలే చేశాడు.