అతనొక్కడే’ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయమై, మొదటి సినిమాతోనే సినీ ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న దర్శకుడు సురేందర్ రెడ్డి. ఆ తరవాత ‘కిక్’, ‘ఊసరవెల్లి’, ‘ధృవ’ రేసుగుర్రం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సూపర్ హిట్ సినిమాలు తీసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి. గతేడాది మెగాస్టర్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' చిత్రానికి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుండి మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, చిరంజీవి లాంటి అగ్ర కథానాయకులందరితో పనిచేసి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
మెగాస్టార్ తో 'సైరా' లాంటి భారీ చిత్రాన్ని తీసిన సురేందర్ రెడ్డి ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. ఈ సినీ పరిశ్రమలో సక్సెస్ ఉంటే అందరూ మన చుట్టూ ఉంటారు. ఒక్కసారి దారి తప్పి ఫెయిల్యూర్ పలకరించిందా అంతే సంగతులు. కనీసం సెల్ఫీ తీసుకోడానికి కూడా ఆసక్తి చూపరు. ఇప్పుడు సురేందర్ రెడ్డి పరిస్థితి అదే అని చెప్పవచ్చు. ఆ సినిమా తర్వాత వెంటనే ప్రభాస్ తో సినిమా చేయవచ్చు అనుకున్న సురేంద్రరెడ్డి ఆశలు తలక్రిందులయ్యారు. దాంతో 'సైరా' తరువాత ఆయన ఒకటి రెండు ప్రాజెక్టులు అనుకున్నప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. చిన్న హీరోల దగ్గరకు వెళ్లి సినిమాలు చేసే పరిస్దితిలో సురేంద్రరెడ్డి లేడు. పెద్ద హీరోలెవరూ సురేంద్రరెడ్డి తో సినిమాలు చేయటానికి ఆసక్తి చూపటం లేదు. ఇది చాలా విచిత్రమైన పరిస్దితి. ఓ మెట్టు దిగి క్రిందకు వెళ్లి చిన్న హీరోతో పెద్ద సినిమా చేద్దామా అంటే బడ్జెట్ సమస్యలు వస్తున్నాయి.
అప్పట్లో నాగచైతన్య, అఖిల్, నితిన్ లతో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయని న్యూస్ వచ్చింది. కానీ అవి స్టోరీలుగానే మిగిలిపోయాయి. అయితే లేటెస్ట్ గా ఇది అల్లు అర్జున్ దగ్గర ఆగింది. సురేందర్ రెడ్డి ఇంతకుముందు వీళ్లద్దరి కాంబినేషన్లో వచ్చిన 'రేసుగుర్రం' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా బన్నీ సూరితో మూవీ ప్లాన్ చేయాలని అనుకుంటున్నాడట. ఇదే నిజమైతే సుక్కుతో మూవీ పూర్తయిన తర్వాత ఈ చిత్రం ఉండే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.