సుశాంత్ సింగ్ మేనేజ‌ర్ హ‌త్యా ఆత్మ‌హ‌త్యా?

Update: 2022-11-25 05:30 GMT
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ డెత్ మిస్ట‌రీ ఇప్ప‌టికీ తేల‌లేదు. అయితే సుశాంత్ సింగ్ మ‌ర‌ణానికి ముందు అత‌డి మాజీ మేనేజర్‌ దిశా సాలియన్‌ మృతి చెంద‌డం అప్ప‌ట్లో క‌ల‌క‌లం రేపింది. సీరియ‌ల్ మ‌ర‌ణాల వెన‌క లింకేమిటో ఎవ‌రికీ అర్థం కాలేదు. అయితే దీనిపై చాలా కాలంగా ద‌ర్యాప్తు సాగిస్తున్న సీబీఐ దిశా మ‌ర‌ణం ప్రమాదం కార‌ణంగానేన‌ని తేల్చింది.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జరిపిన దర్యాప్తులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ..అతని మాజీ మేనేజర్ దిశా సాలియన్ మరణాల మధ్య ఎటువంటి సంబంధం(ఇంట‌ర్ లింక్) లేదని నిర్ధార‌ణ అయ్యింది.
ముంబైకి చెందిన టాలెంట్ మేనేజర్ దిశా సాలియన్ మరణం ప్రమాదవశాత్తు జరిగినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణలో తేలింది. 2020లో దిశా మరణం వివాదాస్పదంగా మారింది, ఫౌల్ ప్లే నిజాల్ని క‌ప్పిపుచ్చడం వంటి అనేక ఆరోపణల తర్వాత 28 ఏళ్ల దిశా తన కెరీర్ లో చాలా మంది స్టార్ ల కాల్షీట్ల‌ను స‌మ‌ర్థంగా నిర్వహించింది. కానీ ఆమె ఆక‌స్మిక మ‌ర‌ణం సంచ‌ల‌న‌మే అయ్యింది. దిశా సాలియన్ 8 జూన్ 2020 రాత్రి మరణించారు. అది ప్ర‌మాద‌వ‌శాత్తూ జ‌రిగిన మ‌ర‌ణం. ఇది హ‌త్య కాదు.. ఆత్మ‌హ‌త్య కాదు. ప్రమాద‌వ‌శాత్తూ జ‌రిగిన‌ది అని ధృవీక‌రించారు.

ముఖ్యంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దిశా మ‌ర‌ణించిన వారం లోపే మరణించారు. దీంతో అభిమానుల్లో ర‌క‌ర‌కాల సందేహాలు రేకెత్తాయి. దిశా మరణంపై ప్రత్యేక ఎఫ్ ఐఆర్ లేదా ఫిర్యాదు లేనప్పటికీ సుశాంత్ మరణానికి సంబంధించి సిబిఐ దర్యాప్తు చేసింది. ఇది సిబిఐ నుండి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్- నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వరకు అనేక కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ కొన‌సాగించాయి.

2020 జూన్ 8-9 మధ్య రాత్రి ముంబైలోని మలాడ్ లోని 14వ అంతస్తు అపార్ట్ మెంట్ బాల్కనీ నుండి పడి దిశ మరణించింది. ఐదు రోజుల తర్వాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతదేహం లభ్యమైనప్పుడు బిజెపి నాయకుడు నితీష్ రాణే ఈ రెండు మరణాలకు సంబంధం ఉందని ర‌హ‌స్య‌ ఫౌల్ ప్లే ఉందని ఆరోపించారు.

కానీ ఇప్పుడు సిబిఐ విచారణలో దిశా మద్యం మత్తులో బ్యాలెన్స్ కోల్పోయి పడిపోయినట్లు తేలింది. ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్ర‌కారం.. ఒక పేరు చెప్పని సిబిఐ అధికారిని ఉటంకిస్తూ -``దిశా సాలియన్ విషయంలో తీవ్రమైన ఆరోపణలు రావ‌డం వెనువెంట‌నే రెండు మరణాలకు సంబంధం ఉందని వాదనలు వినిపించ‌డం.. సాలియన్ కొంతకాలం రాజ్ పుత్ కోసం పనిచేసినందున ఈ మ‌ర‌ణాల‌పై సుదీర్ఘ కాలం ద‌ర్యాప్తు సాగింది. ఇప్ప‌టికి ఆమె మరణం గురించి వివరంగా విచారించబడింది. ఇంత‌కీ దిశా ఎలా మ‌ర‌ణించింది? అంటే ...

తన పుట్టినరోజు సందర్భంగా దిశా సలియన్ తన నివాసంలో గెట్ టు గెదర్ పార్టీని నిర్వహించిన‌ట్లు విచారణలో వెల్లడైంది. అందులో భాగంగానే జూన్ 8వ తేదీ రాత్రి పార్టీ జరిగింది. అయితే ఆ రాత్రి మద్యం సేవించిన సలియన్ బ్యాలెన్స్ కోల్పోయి ఆమె ఫ్లాట్ పారాపెట్ నుండి జారిప‌డిపోయింది. రెండు మరణాలకు సంబంధం ఉందని లేదా దిశ మరణం సుశాంత్ ఆత్మహత్యను ప్రేరేపించిందని సూచించడానికి ఎటువంటి రుజువు లేదని సిబిఐ అధికారి తెలిపారు.

మరో సిబిఐ అధికారి దీనిపై ఉటంకిస్తూ-``సాలియన్‌పై దాడి జరిగిందని ఆమె సహాయం కోసం రాజ్ పుత్ ను సంప్రదించారని .. దీనివెన‌క‌ పెద్ద రాజకీయ కుట్ర ఉందని రాణే చేసిన ఆరోపణలలో దర్యాప్తులో ఎటువంటి వాస్తవం కనుగొనలేదు. కేసు సున్నితమైన స్వభావం ఆరోపణల కారణంగా పరిస్థితులను విచారించడం అవసరమైంది`` అని తెలిపారు.

దిశా సాలియ‌న్ వ్య‌వ‌హారం అలా ఉండ‌గానే ఆత్మహత్యగా భావించిన సుశాంత్ మృతిపై సీబీఐ దర్యాప్తు కొనసాగిస్తోంది. అయితే ఈ విషయంపై ఏజెన్సీ ఇప్పటివరకు ఎటువంటి తుది నివేదికను దాఖలు చేయలేదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News