క‌రోనా పంచ్ కి నిర్మాత‌ల మండ‌లి నిధి క‌రిగిన‌ట్టేనా?

Update: 2021-07-13 12:30 GMT
క‌రోనా కార‌ణంగా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన నిర్మాత‌ల మండ‌లి చేప‌ట్ట‌వ‌లసిన కార్య‌క్ర‌మాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప‌రిస్థితులు కుదుట‌ప‌డుతోన్న నేప‌థ్యంలో తిరిగి అన్ని కార్య‌క్ర‌మాలు యాథావిధిగా మొద‌ల‌వుతున్నాయి. దీనిలో భాగంగా నిర్మాత‌ల మండ‌లి కార్య‌ద‌ర్శ‌కులు టి. ప్ర‌స‌న్న కుమార్- మోహ‌న్ వ‌డ్ల‌ప‌ట్ల ఎవ్వ‌ర్ లేటెస్ట్ అప్ డేట్ అందించారు.

తెలుగు సినిమా క‌థ‌లు అన్ని భాష‌ల టైటిల్స్ రిజిస్ట్రేన్.. సెన్సార్ కోసం ప‌బ్లిసిటీ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ 30 క‌థ‌లు స‌హా 13 టైటిల్స్ రిజిస్ట్రేష‌న్స్ జ‌రిగాయ‌న్నారు. త‌మిళ్ డ‌బ్బింగ్ చిత్రం `ఆకాశ‌వాణి చెన్నై కేంద్రం`,.. భూత్ స‌ర్కార్ చిత్రాల‌కు సెన్సార్ ప‌బ్లిసిటీ క్లియ‌రెన్స్ ఇచ్చామ‌న్నారు. మండ‌లిలో స‌భ్య‌త్వం ఉన్న‌వారికి ఇటువంటి స‌దుపాయాలు క‌ల్పిస్తున్నామ‌న్నారు.

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబ‌ర్స్.. ఇత‌ర అనుబంధ సంస్థ‌ల్లో స‌భ్య‌త్వం ఉన్న‌వారు కూడా ఛాంబ‌ర్ లో టైటిల్స్ ని రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపారు. అలాగే స‌భ్యుల‌కు తెలుగు సినిమా ట్రైల‌ర్ల‌కు ప‌బ్లిసిటీ క‌న్సెష‌న్ రేట్ల‌కు ఇస్తున్నామ‌న్నారు. సోష‌ల్ మీడియాలో ఎల‌క్ట్రానిక్ మీడియాలో ఉచితంగా ప‌బ్లిసిటీ క‌ల్పిస్తున్నామ‌న్నారు. అలాగే మండ‌లి త‌రుపున అర్హులైన స‌భ్యుల‌కు పెన్ష‌న్.. ఇన్సురెన్స్ స‌హా ప‌లు స‌దుపాయాలు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. మొత్తానికి క‌రోనా కార‌ణంగా నిర్మాత‌ల‌కు మండ‌లి త‌రుపున కొన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

అయితే క‌రోనా మొద‌టి వేవ్ అనంత‌రం నిర్మాత‌ల మండ‌లి నుంచి నిధి క‌రుగుతోంద‌ని ఇన్సూరెన్సులు సంక్షేమ కార్య‌క్ర‌మాల పేరుతో ఉన్న‌దంతా క‌రిగిపోవ‌డ‌మే కానీ తిరిగి చేరేది లేద‌ని కొంద‌రు వాపోయిన సంగ‌తిని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవాలి. ఇంత‌కుముందు నిర్మాత‌ల మండ‌లి నిధి గోల్ మాల్ కి సంబంధించిన విచార‌ణ ఇంకా మ‌ధ్య‌లోనే పెండింగులో ఉంది. దీనిపై ఎవ‌రూ ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌లేదు.
Tags:    

Similar News