ఉప్పెన హీరోకి మెగా కాంపౌండ్ హెల్ప్‌ లేదా?

Update: 2022-09-05 03:59 GMT
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఉప్పెన సినిమా తో ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్‌ తేజ్ మొదటి సినిమా తోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా దాదాపుగా వంద కోట్ల వసూళ్లను నమోదు చేసింది అనేది టాక్. మొదటి సినిమా తో ఆ రేంజ్ వసూళ్లను దక్కించుకున్న మెగా హీరో మరియు తెలుగు హీరో అంటూ వైష్ణవ్‌ తేజ్‌ గురించి ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన కెరీర్‌ డైలమాలో పడ్డట్లు అయ్యింది.

ఉప్పెన విడుదలకు ముందే క్రిష్ దర్శకత్వంలో కొండ పొలం అనే ప్రయోగాత్మక సినిమాకు కమిట్ అయ్యాడు. ఆ సినిమా కమర్షియల్‌ గా హిట్ అవ్వక పోవచ్చు అనే చాలా మంది అనుకున్నారు. కానీ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సినిమా అవ్వడం వల్ల మ్యాటర్ ఉంటుందని భావించారు. వైష్ణవ్ తేజ్ కు నటుడిగా మంచి పేరు అయితే ఆ సినిమా తెచ్చి పెట్టిందని చెప్పాలి.

ఆ సినిమా కమర్షియల్ గా హిట్ కాకున్నా కూడా ఆయన కెరీర్‌ పై పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ తాజాగా విడుదల అయిన రంగ రంగ వైభవంగా ఫ్లాప్‌ వైష్ణవ్‌ తేజ్ కెరీర్‌ పై తీవ్రంగా ప్రభావం చూపించినట్లుగానే అనిపిస్తుంది. ఆయన మార్కెట్‌ చాలా తగ్గే అవకాశం ఉంది. అంతే కాకుండా ముందు ముందు ఆయనతో సినిమాలు చేసేందుకు కూడా మేకర్స్ ఉత్సాహంతో ముందుకు వస్తారా అనేది అనుమానమే అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఉప్పెన సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అవ్వడంతో ఆయన కెరీర్‌ సందిగ్ధంలో పడ్డట్లు అయ్యిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయం లోనే వైష్ణవ్ తేజ్ యొక్క సినిమాల కథలను మెగా కాంపౌండ్ వినడం లేదా... వారి యొక్క సలహాలు ఎందుకు తీసుకోవడం లేదు అనేది చర్చనీయాంశంగా మారింది.

వైష్ణవ్ తేజ్ సినిమా ఎంపిక చేసుకునే ముందు చిరంజీవి మరియు ఇతర మెగా కాంపౌండ్‌ హీరోల యొక్క సలహాలు తీసుకోవడంతో పాటు.. సినిమా పూర్తి అయిన తర్వాత మెగా కాంపౌండ్‌ కు చెందిన పెద్దల యొక్క ఫైనల్‌ సలహా తీసుకోవడం మంచిది.

కానీ వైష్ణవ్‌ తేజ్ రంగ రంగ వైభవంగా సినిమా కి అలా చేసినట్లుగా లేరు అంటున్నారు. ఇప్పటికైనా మెగా కాంపౌండ్ హెల్ప్ తో వైష్ణవ్‌ తేజ్ సినిమాలు చేయాలంటూ మెగా ఫ్యాన్స్ సూచిస్తున్నారు. వైష్ణవ్ తేజ్ నాల్గవ సినిమా బుచ్చిబాబు దర్శకత్వంలో ఉండే అవకాశం ఉందని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News