ముంబై నుంచి కోటి ఆశలతో టాలీవుడ్‌లో అడుగుపెడుతుంటారు మోడల్స్. కథానాయికగా వెలిగిపోవాలని కలలు గంటుంటారు. ప్రతియేటా ఎంతోమంది అలా అదృష్టం పరీక్షించుకుని వెళుతుంటారు. అందులో సెలక్టివ్‌గా కొద్దిమందికి మాత్రమే తెలుగు సినిమాని ఏలే అదృష్టం దక్కుతుంది. అయితే కొందరికే ఆదిలోనే హంసపాదు అన్న చందంగా సక్సెస్ దక్కదు.
అలా వచ్చి వెళ్లిన కథానాయికల జాబితాలో ఓ ప్రముఖ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఓ పిల్ల ఈ ఇషా తల్వార్. శ్రీదేవి, బోనీకపూర్ ఫ్యామిలీకి బంధువు అయిన ఈ అమ్మడు మలయాళంలో తొలుత అదృష్టం పరీక్షించుకుంది. అక్కడ డజను సినిమాల్లో నటించినా పెద్ద స్టార్ కాలేకపోయింది. ఆ తర్వాత తెలుగు పరిశ్రమపై కన్నేసి నితిన్ సరసన 'గుండె జారి గల్లంతయ్యిందే'లో నిత్యాతో కలిసి నాయికగా హొయలొలికించింది. ఆరంగేట్రమే హిట్. కానీ ఆ తర్వాత మైనే ప్యార్ కియా చిత్రంతో ఫ్లాప్ కొట్టి వెనక్కి వెళ్లిపోయింది.
చివరికి ఇదిగో ఇలా టూర్లు అంటూ ఊళ్లు పట్టుకుని తిరుగుతోంది. మైసూర్ వెళ్లి మైసూర్ మహారాణిలా ఫోజులిస్తోంది. తనకి అన్నీ తానే అయిన మమ్మీతో కలిసి శికార్లు చేస్తోంది. ఇషాని బోలెడంత మంది ఫాలోవర్స్ ఫేస్బుక్లో ఫాలో అవుతుంటారు. శికార్లతో పాటు ఇతర విషయాల్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. మైసూర్ ప్యాలెస్ ముందు ఉన్నప్పటి ఫోజులివి..