`ఇస్మార్ట్ శంక‌ర్` రెండో రోజు షేర్

Update: 2019-07-20 10:23 GMT
తొలిరోజు 7.50కోట్లు..  రెండో రోజు 4.28కోట్లు.. `ఇస్మార్ట్ శంక‌ర్` రెండ్రోజుల షేర్ వ‌సూళ్లు ఇవి. ఓ వైపు క్రిటిక్స్ నుంచి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చినా వ‌సూళ్ల ప‌రంగా ఫ‌ర్వాలేద‌నిపించింది. రామ్ కెరీర్ లో ఇవి చ‌క్క‌ని వ‌సూళ్లు అని ట్రేడ్ విశ్లేషిస్తోంది.

రామ్- పూరి జ‌గ‌న్నాథ్‌ కాంబినేష‌న్ మూవీ `ఇస్మార్ట్ శంక‌ర్` తొలి రెండ్రోజుల్లో 12.50 కోట్ల షేర్ వ‌సూలు చేసింద‌ని తాజాగా ట్రేడ్ రిపోర్ట్ అందింది. దాదాపు 20 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన‌ ఇస్మార్ట్ శంకర్ ఆ  మేర‌కు షేర్ మార్క్ ని అందుకోవ‌డం క‌ష్ట‌మేమీ కాద‌న్న విశ్లేష‌ణ సాగుతోంది. తెలుగు రాష్ట్రాలలో ఇస్మార్ట్ శంకర్ రెండో రోజు షేర్ ప‌రిశీలిస్తే..

నైజాం-రూ. 1.96 కోట్లు.. సీడెడ్-రూ. 0.7కోట్లు.. ఉత్తరాంధ్ర -రూ.0.52కోట్లు.. తూ.గో జిల్లా -రూ.0.29కోట్లు.. ప‌.గో జిల్లా -రూ.0.21కోట్లు.. కృష్ణ -0.25కోట్లు.. గుంటూరు-0.24కోట్లు.. నెల్లూరు-రూ.0.12కోట్లు వ‌సూలైంది. రెండు తెలుగు రాష్ట్రాలలో రెండవ రోజు మొత్తం షేర్ రూ. 4.28కోట్లు న‌మోదైంది. తొలి మ‌లి రోజులు క‌లుపుకుంటే ఇప్ప‌ట‌కి 12.50 కోట్లు వ‌సూలైంది. బీసీ కేంద్రాల్లో మాస్ నుంచి ఆద‌ర‌ణ బావుండ‌డం ఈ సినిమాకి క‌లిసొస్తోంద‌ని ట్రేడ్ చెబుతోంది.

    

Tags:    

Similar News