టాలీవుడ్ లో ఐటం పాటల తీరు పూర్తిగా మారింది. కొన్నేళ్లుగా ఐటమ్ పాటలకు కథానాయికల్ని ఎంపిక చేయడం చూస్తున్నదే. ఒకప్పుడు ఐటం పాటలంటే బాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా ఐటం గాళ్స్ గా గుర్తింపు ఉన్న భామల్ని దిగుమతి చేసుకునే వారు. టాప్ మోడల్స్ ని ముంబై ర్యాంప్ నుంచి ఎంపిక చేసుకునేవారు. దీనికి ప్రత్యేకంగా అధిక పారితోషికం చెల్లించి దర్శక నిర్మాతలు ఇంపోర్ట్ చేసుకునేవారు. ఇంకా అవసరం అనుకుంటే పారితోషికంతో పాటు ఐటమ్ భామలకు అదనపు సౌకర్యాలు కల్పించేవారు. అయితే ఇప్పుడా సీన్ ఎక్కడా కనిపించలేదు.
గత కొంత కాలంగా ఆ పోకడ కనుమరుగైనట్లే కనిపిస్తోంది. ఐటం భామల కోసం ముంబైకే వెళ్లాలంటూ ప్రత్యేకంగా పరుగులు తీసే పనిలేదు. టాలీవుడ్ లో పేరున్న హీరోయిన్ లనే ఐటం గాళ్స్ గా మార్చేస్తున్నారు.
భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో సదరు భామామణులు ముందుకొస్తున్నారు. వీళ్లందరికీ ఐడెంటీతో పాటు మంచి పారితోషికం దక్కుతోంది. కెరీర్ కాస్త డౌన్ ఫాల్ లో ఉన్న సమయంలో చందమామ కాజల్ అగర్వాల్ `పక్కా లోకల్` అంటూ పిచ్చెక్కించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటించిన కాజల్ `జనతా గ్యారేజ్` తో ఐటం గాళ్‌గాను మారిపోయింది. `రంగస్థలం`లో `జిగేల్ రాణి అంటూ` స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతున్న పూజా హెగ్డే కూడా ఐంట పాటలో ఊపేసింది. ఇక `జంక్షన్ లో నా ఫంక్షన్` అంటూ `ఆగడు`లో శ్రుతిహాసన్ ఐటం భామగా కుర్రకారుని ఆకట్టుకుంది.
ఇటీవలే `ఊ అంటావా మావ..ఊఊ అంటావా మా అంటూ` సమంత `పుష్ప`లో స్పెషల్ అప్పిరియన్స్ తో ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. తాజాగా `ఆచార్య` సినిమాతో రెజీనా ఐటం గాళ్ల్ గా టర్న్ తీసుకుంది. హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించిన భామ ఆలస్యంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్న సరైన నిర్ణయమే అన్న ఫీడ్ బ్యాక్ వస్తోంది. చిరు తో కలిసి రొమాంటిక్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ కిక్కు పెంచింది. ఈ పాటతో రెజీనాకి మంచి గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఏది ఏమైనా టాలీవుడ్ హీరోయిన్లే ఐటం భామలుగా మారడం..బాలీవుడ్ ఐటం గాళ్స్ కి ఇబ్బందిరకమైనదే. రెజీనా కెరీర్ టాలీవుడ్ లో అంతంత మాత్రంగానే ఉండగా ఆచార్యలో ఐటమ్ నంబర్ తో మరోసారి పుంజుకుంటుందనే భావిస్తున్నారు.