ఆ నలుగురు జంప్ తో కష్టాల్లో 'జబర్దస్త్‌'

Update: 2022-06-10 03:30 GMT
ఈటీవీలో దాదాపుగా దశాబ్ద కాలంగా టెలికాస్ట్‌ అవుతున్న జబర్దస్త్‌ కామెడీ షో రేటింగ్ పరంగా రికార్డులను నమోదు చేసింది. సుదీర్ఘ కాలం పాటు తెలుగు షో ల్లో అత్యధిక రేటింగ్ దక్కించుకుంటున్న షో గా జబర్దస్త్‌ నిలిచింది. ఈటీవీని టాప్‌ లో నిలపడంలో జబర్దస్త్‌ యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో అందరికి తెల్సిందే. జబర్దస్త్‌ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ పరిచయం అయ్యారు.. కొందరు మద్యలో వెళ్లి పోయారు.

జబర్దస్త్‌ అనగానే గుర్తుకు వచ్చే కొన్ని పేర్లలో ఖచ్చితంగా హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్‌ మరియు గెటప్ శ్రీనుల పేర్లు ఉంటాయి. ఈ ముగ్గురితో పాటు మరో కీలకమైన వ్యక్తి రోజా. 9 ఏళ్లకు పైగా జబర్దస్త్‌ కు జడ్జ్‌ గా వ్యవహరించిన ఆమె ఇటీవలే మంత్రి పదవి వచ్చిందని జబర్దస్త్‌ కు గుడ్‌ బై చెప్పేశారు. ఇక ఆ ముగ్గురు కమెడియన్స్ కూడా ఇటీవలే జబర్దస్త్‌ ను వీడినట్లుగా క్లారిటీ వచ్చేసింది.

వారికి బయట ఆఫర్లు రావడం వెళ్లారా లేదంటే మల్లెమాల వారు ఇస్తున్న పారితోషికం తక్కువ అవ్వడం వల్ల వెళ్లారా అనే విషయంలో క్లారిటీ లేదు. కాని ఖచ్చితంగా జబర్దస్త్‌ నుండి ఆ ముగ్గురు కమెడియన్స్ వెళ్లి పోవడంతో జబర్దస్త్‌ కష్టాల కడలిని ఈదుతోంది. గతంలో దాదాపుగా గంటన్నర ఎపిసోడ్‌ ఉండేది. కాని ఇప్పుడు 40 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్ మరీ 35 నిమిషాలే ఉంటున్నాయి.

ఇండస్ట్రీ నుండి వీళ్లకు ఆఫర్లు వస్తున్న కారణంగానే వెళ్లి పోతున్నారు. మరో వైపు కొత్త కమెడియన్స్ ఇంతకు ముందు ఉన్న వారంత యాక్టివ్‌ గా ఉండటం లేదు. దాంతో కొత్త టీమ్స్ ఫామ్‌ అవ్వడం లేదు. అదే సమయంలో వెళ్లి పోయిన వారి స్థానంను భర్తీ చేసే స్థాయిలో ట్యాలెంట్ ఉన్న వారు కనిపించడం లేదు. ముందు ముందు జబర్దస్త్‌ కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సుడిగాలి సుధీర్‌ వరుసగా హీరో పాత్రలు చేస్తూ సినిమాలకు కమిట్ అవుతున్నాడు. మరో వైపు బుల్లి తెర కమల్‌ హాసన్ అంటూ పేరు దక్కించుకున్న గెటప్ శ్రీను కూడా క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యాడు. ఇక హైపర్‌ ఆది కూడా బిజీ బిజీగా ఉన్నాడు. జబర్దస్త్‌ నుండి వారు బయటకు వెళ్లినా వారి కెరీర్‌ కు ఎలాంటి ఇబ్బంది లేదు. కాని జబర్దస్త్‌ కు కష్టాలు తప్పవేమో అంటున్నారు.
Tags:    

Similar News