ఇప్పుడు వస్తున్న హీరోలలో ఎవరు ఫిట్ గా ఉన్నారు అంటే ఎవరని చెబుతారు? ఎవరికి వారు జిమ్ కి వెళ్ళి కండలును మంచిగా మలిచి ఫిట్ గా స్ట్రాంగ్ గా ఉండటానికే చూస్తున్నారు. మన తెలుగులో కూడా ఇప్పుడు యంగ్ హీరోలు అంతా మంచి ఫిట్ గా కనిపిస్తున్నారు. బాలీవుడ్ అంటే ఇంకా చెప్పే పని లేదు అనుకోండి. అక్కడ హీరోకి అది ఉండవలిసిన కనీస అర్హత. ఆ మాటకు వస్తే నటుడు కి అది ఉండవలిసిన కనీస అవసరం అని చెప్పాలి.
అయితే మనం అనుకోవడం ఎలా ఉన్న ఆ హీరోలు గురించి వాళ్ళతో పని చేసే హీరోయిన్ చెబితే కొంచం బాగుంటిది కదా. శ్రీలంక సుందరి జ్యాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు బాలీవుడ్ హాట్ అండ్ ఫిట్ హీరోయిన్లు లో ఒకరు. ఆమె కలిసి పని చేసిన హీరోల ఫిట్నెస్ గురించి ఆమె ఫిట్నెస్ గురించి ఆమె ఏమి అన్నది అంటే ‘‘స్కూలు రోజుల నుంచే నేను అథ్లెట్‌ను. బాస్కెట్‌బాల్ ఆడేదాన్ని. ట్రాక్‌పై పరుగులు పెట్టేదాన్ని. అయితే అప్పుడు జిమ్‌కు వెళ్లేదాన్ని కాదు. అందాల పోటీకి ఎంపికైన తర్వాతే జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టా’’ అని చెప్పింది. ఇప్పుడు బాలీవుడ్‌లో ఉన్న హీరోలులో మీకు ఫిట్ గా ఉన్నాడు అని ఏ హీరోని చూస్తే అనిపిస్తాడు అని అడిగితే “నేను పని చేసిన అందరి హీరోలు ఫిట్ గానే ఉన్నారు. సల్మాన్ ఖాన్ గురించి మనం చెబుతాం చెప్పండి ఆయన ఫిట్నెస్ కింగ్. ఇకపోతే వరుణ్ ధావన్ తో జిమ్ చేయడం నాకు బాగా ఇష్టం. వరుణ్ కూడా నాలాగే ఆలోచిస్తాడు కొంచం సేపు జిమ్ చేసి వెంటనే ఏదైనా తిందామ అని అడుగుతాడు చాల ఫన్నీ గా ఉంటాడు. టైగర్ ష్రాఫ్, జాన్ అబ్రహాం కూడా బాగ కష్టపడతారు'' అని చెప్పింది.
జ్యాక్విలిన్ ఫెర్నాండెజ్ కూడా తన ఫిట్నెస్ తో మరింత హాట్ గా మారి ఏ లిస్ట్ హీరోయిన్ అయిపోయింది. త్వరలో రిలీజవ్వనున్న 'ఏ జెంటిల్ మ్యాన్' సినిమా కోసం అమ్మడు తన ఫిట్టయిన అందాలను ఎలా ఆరబోసిందో మనకు తెలిసిందే.