సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ కు ఉన్న ఇంపార్టెన్స్ వేరే దేనికీ కనిపించదు. అది మంచి అయినా, చెడు అయినా పక్కాగా ఫాలో అయిపోతుంటారు. ఇలాంటి వాటిపై నమ్మకం లేదని పైకి చెబుతున్నా.. లోలోపల మాత్రం టెన్షన్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇప్పుడు అలాగే టెన్షన్ పడాల్సిన పరిస్థితి లచ్చిందేవికి ఓ లెక్కుంది డైరెక్టర్ జగదీష్ తలశిలకు వచ్చింది. జగదీష్ ను వెంటాడుతున్న సెంటిమెంట్ ఆయన గురువు రాజమౌళే.
సాధారణంగా జక్కన్న పేరు చెబితే పేరు చెబితే అంతా పాజిటివ్ ఎసెన్సే కానీ.. ఆయన శిష్యుల విషయానికొచ్చేసరికి, రాజమౌళి అంటే ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ఈయన దగ్గర పని చేసిన సహాయకులు ఎవరూ ఇప్పటివరకూ సక్సెస్ సాధించలేకపోయారు. అజయ్ హీరోగా డి.ఎస్.కన్నన్ అనే దర్శకుడు సారాయి వీర్రాజు సినిమా తీశాడు. అతను కూడా రాజమౌళి అసిస్టెంటే. ఇది నిరుత్సాహపరిచింది. ఈయనే కాదు. నితిన్ హీరోగా ద్రోణను తెరకెక్కించిన డైరెక్టర్ కరణ్ కుమార్, బాలకృష్ణతో మిత్రుడు చిత్రాన్ని డైరెక్ట్ చేసిన మహదేవలు కూడా రాజమౌళి దగ్గర అసెస్టెంట్ డైరెక్టర్లుగా చేసినవారే.
అలాగే గతేడాది వచ్చిన దిక్కులు చూడకు రామయ్యా చిత్రానికి దర్శకత్వం వహించిన త్రికోఠి కూడా రాజమౌళి శిష్యుడే. వీరెవరూ రాజమౌళి పేరు నిలబెట్టలేకపోయారు. రాఘవేంద్రరావుకి శిష్యుడిగా సక్సెస్ అయ్యాడు రాజమౌళి. కానీ ఆయన శిష్యులు మాత్రం రాజమౌళి మాదిరిగా కాకపోయినా, కనీస మాత్రం కూడా విజయం అందుకోలేకపోతున్నారు. ఇప్పుడు లచ్చిందేవికి ఓ లెక్కుంది డైరెక్టర్ జగదీష్ తలశిల ఏం చేస్తాడనే ఆసక్తి నెలకొంది.