టాలీవుడ్ లో జగపతిబాబు చాలాకాలం పాటు హీరోగా ఉన్నా ఆయనలోని నటుడిని బయటకు తెచ్చే రోల్స్ చాలా పరిమితంగా వచ్చాయి. లెజెండ్ సినిమాతో విలన్ గా మారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జగపతిబాబు ఆ తరవాత ఇక వెనుతిరిగి చూసుకోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ విలన్ గా ఆయన ఇప్పుడు సౌత్ లోనే అత్యంత డిమాండ్ ఉన్న ఆర్టిస్టు.
ఇటీవల కాలంలో జగపతిబాబు చేసిన క్యారెక్టర్లలో రంగస్థలం మూవీలో చేసిన ప్రెసిడెంట్ పాత్ర అందరినీ తెగ ఆకట్టుకుంది. తక్కువ మాటలతోనే దుర్మార్గుడైన సర్పంచిగా అదరగొట్టేశాడు. ఓరకంగా ఈ పాత్ర తన సెకండ్ ఇన్నింగ్స్ లో సెకండ్ లైఫ్ అని జగపతిబాబు చెప్పుకొచ్చాడు. ‘‘నేను మాస్ క్యారెక్టర్లు ఇంతకుముందు చేశాను. రంగస్థలంలో ఓ టిపికల్ ప్రెసిడెంట్ గా సుకుమార్ సూపర్ గా ప్రొజెక్ట్ చేశాడు. ఈ పాత్రకు డబ్బింగ్ చెబుతున్నప్పుడు ఆ సర్పంచిని చంపేయాలన్నంత కోపం నాకే వచ్చింది’’ అంటూ ఆ పాత్ర తనను ఏ రేంజ్ లో మెప్పించిందో జగపతిబాబు రివీల్ చేశాడు.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక నేను చేసిన పాత్రలు హాట్ అండ్ స్టయిల్ గా ఉన్నాయని మెచ్చుకుంటున్నారు. రంగస్థలంలో షర్ట్ లేకుండా కేవలం పై కండువాతో కనిపించినా ఈ లుక్ కూడా బాగుందనే అన్నారని జగపతిబాబు హ్యాపీగా ఫీలవుతూ చెప్పాడు.