కొంత మంది హీరోలు ఎంత ఎదిగినా ఒదిగే వుంటారు. వాళ్లలో తాము స్టార్ హీరోననే దర్పం, దర్జా ప్రదర్శించాలనే మనస్తత్వం ఏ మూలనా కనిపించదు. అలాంటి హీరోలు చాలా అరుదుగా వుంటారు. అలాంటి ఓ అరుదైన హీరో గురించి మన దర్శకధీరుడు రాజమౌళి చెప్పిన తీరు పలువురిని ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ `ఆర్ ఆర్ ఆర్`.
దర్శకధీరుడు జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 14 భాషల్లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో అబ్బుర పరిచే పోరాట ఘట్టాలతో ప్రీ ఇండిపెండెంట్ పిరియడ్ నాటి పరిస్థితులకు అద్దంపడుతూ ఓ కాల్పనిక కథని తెరపైకి తీసుకొచ్చారు. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ తో సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందుకు ఏమాత్రం తీసిపోని స్తాయిలో ప్రమోషన్స్ ని ప్లాన్ చేశారు రాజమౌళి.
20 కోట్లు కేవలం ప్రచారానికే కేటాయించి దేశ వ్యాప్తంగా `ఆర్ ఆర్ ఆర్` హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నారు. ఇందులో భాగంగా వారం రోజుల పాటు బాలీవుడ్ లో మకాం వేసిన చిత్ర బృందం తాజాగా అక్కడ ప్రచార హోరు ముగియడంత దక్షిణాదిలో ప్రచారం మొదలుపెట్టింది. ఈ సందర్భంగా చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించి అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న `ఆర్ ఆర్ ఆర్` టీమ్ ప్రస్తుతం అక్కడి మీడియాలో జోరుగా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా తమిళ ఛానల్ విజయ టెలివిజన్ కు రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రత్యేక ఇంటర్వ్యూని ఇచ్చారు.
ఈ సందర్భంగా తమిళ స్టార్ హీరో తల అజిత్ గురించి పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు రాజమౌళి. రామోజీ ఫిల్మ్ సిటీలో తొలిసారి అజిత్ ని కలిశానన్నారు. సితార హోటల్ రెస్టారెంట్ లో ఆయనని తొలిసారి చూశాను. అప్పుడు ఆయన ఓ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నారు. నన్ను చూడగానే వెంటనే లేచి నా దగ్గరికి వచ్చి పలకరించారు. ఆ తరువాత తన టేబుల్ వద్దుకు తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఇద్దరం మాట్లాడుకుంటుండగానే అప్పుడే నా భార్య రమ హోటల్ లోకి ప్రవేశించింది..నేను తనని చూసి వెంటనే పిలిచాను.. వెంటనే అజిత్ తను మీ వైఫ్ కదా అన్నారు.. యస్ అని నేను చెప్పగానే అజిత్ వెంటనే లేచి నా వైఫ్ దగ్గరికి వెళ్లి `నేను అజిత్` అని తనని తాను పరిచయం చేసుకున్న తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంవది.
ఇంత పెద్ద స్టార్ అయివుండి కూడా చాలా సాధారణ వ్యక్తిలా వ్యవహరించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలి. కోట్ల మంది అభిమానులు ఆయనని అభిమానిస్తూ, ఆరాధిస్తూ తల తల అని పిలుస్తున్నారు. అయితే అజిత్ మాత్రం ఆ పేరు తీసేయండి నేను అజిత్ అజిత్ కుమార్ ఏకె అని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన గొప్పదనానికి సింపుల్ సిటీకి హ్యాట్సాఫ్ చెబుతున్నాను` అన్నారు జక్కన్న. దీంతో ఎన్టీఆర్, చరణ్, ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ తో పాటు అక్కడున్న ఆడియన్స్ చప్పట్లతో హార్షాన్ని వ్యక్తం చేశారు.
తల అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `వలిమై`. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీకేయ కీలక విలన్ గా నటించాడు. ధీరన్ అధిగారం ఒండ్రు (ఖాకీ), నేర్కొండ పార్వై (పింక్) వంటి చిత్రాలతో హెచ్ వినోద్ దర్శకుడిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నారు. అలాంటి దర్శకుడు చేస్తున్న మూడవ సినిమా కావడం, అజిత్ , బోనీ కపూర్‌ల కలయికలో `నేర్కొండ పార్వై` వంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గురువారం విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న `వలిమై` జనవరి 14న సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.