కలనే కథగా తెరకెక్కించిన జేమ్స్ కామెరూన్.. టర్నింగ్ పాయింట్ ఇదే..!

Update: 2022-12-15 04:30 GMT
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రపంచంలోనే గొప్ప దర్శకుడిగా కీర్తించబడుతున్నారు. ‘టాటానిక్’ సినిమాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న జేమ్స్ కామెరూన్ పేరు సినిమా జగత్తు ఉన్నంత కాలం అతడి పేరు శాశ్వతంగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరో రెండ్రోజుల్లో ‘అవతార్-2’తో ప్రపంచ సినీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జేమ్స్ కామెరూన్ లైఫ్ స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!

జేమ్స్ కామెరూన్ కెనడాలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి ఇంజనీర్ కాగా.. తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. జేమ్స్ కామెరూన్ కు చిన్నతనం నుంచి చదువంటే ఆసక్తి లేదు. అయితే తల్లి చెప్పే కథలు వినడం.. పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. అలాగే పాఠశాలలో ఫిజిక్స్ ల్యాబ్ లో చేసే ప్రయోగాలంటే అమిత ఆసక్తిని కనబరిచేవాడు. ఈ క్రమంలోనే కామెరూన్ సైన్స్ ఫిక్షన్ కథలపై మక్కువ పెంచుకున్నాడు.

ఇంజనీరింగ్ చదువును మధ్యలో మానేసిన కామెరూన్ ఆ తర్వాత ట్రాక్ డ్రైవర్ గా కొన్నాళ్లు పని చేశాడు. అయితే ఈ పని బదులు వేరే పని చూసుకొని అతని తల్లి ఎప్పుడు చెప్పేది. అయితే అతను మాత్రం తన పని పట్ల సంతృప్తిని వ్యక్తం చేసేవాడు. అయితే ఖాళీ సమయాల్లో కవితలు.. కథలు రాసేవాడు. 1977లో ‘స్టార్ వార్స్’ సినిమా చూశాక అతడికి అలాంటి సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడువుగా ఓ నిర్మాణ సంస్థలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు.

రెండేళ్ల ప్రయత్నం తర్వాత ‘పిర్హనా’ అనే సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాను పది రోజులు తెరకెక్కించాక అతడికి దర్శకత్వ సామర్థ్యం లేదని నిర్మాతలు పక్కన పెట్టి వేరే వారికి అవకాశం ఇచ్చారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ఆ సంస్థలోనే ‘పిర్హనా’ సినిమా కోసం పని చేశాడు. ఈ సినిమా హిట్టు కావడంతో ‘ఫిర్హనా-2’ కి నిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే మొదటి దర్శకుడు ఈ సినిమా తీయనని నిర్మాతలు చెప్పడంతో కామెరూన్ కే తిరిగి అవకాశం దక్కింది.

ఈ అవకాశాన్ని కామెరూన్ చక్కగా వినియోగించుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. దీంతో నిర్మాతలు అతడిని నమ్మడం మొదలుపెట్టారు. ఒకసారి తనకు ఫుడ్ పాయిజన్ కావడంతో కొన్నిరోజులు షూటింగ్ నుంచి విరామం తీసుకున్నారు. ఈక్రమంలోనే అతడికి ఓ పీడకల వచ్చింది. రోబో తనపై దాడి చేసినట్లు కల రాగా దీనిని కథ రాసుకొని ‘ది టెర్నినేటర్’ అనే మూవీని తెరకెక్కించి సూపర్ హిట్టు కొట్టాడు.  ఈ సినిమా తర్వాత నేషనల్ జియోగ్రాఫికల్ ఛానల్ కోసం కొన్ని డాక్యుమెంటరీలు తీశాడు.

ఈ క్రమంలోనే ‘టైటానిక్’ సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. షూటింగ్ ముందు టైటానిక్ షిప్పును చూడటానికి అట్లాంటిక్ మహాసముద్రం దిగువకు అనేక సార్లు డైవ్ చేస్తూ వేళ్లాడు. ఆ సమయంలోనే షిప్పును చూస్తూ అనేక డైలాగులు రాసుకున్నాడు. అయితే పని పట్ల దూకుడు చూపించే కామెరూన్ నటీనటులతో కఠువుగా ఉండేవాడు. దీంతో అతనితో రెండోసారి పని చేయడానికి నటీనటులు ఇష్టపడేవారు కాదు. టైటానిక్ హీరోయిన్ కేట్ విన్ల్సెట్ సైతం ఇదే విషయాన్ని పలుసార్లు చెప్పింది.

కామెరూన్ తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ తనతో సినిమా చేసేందుకు ఇష్టపడలేదని చెప్పింది. అయితే అవతార్ సినిమా చూశాక సిక్వెల్లో నటించేందుకు ఒప్పుకున్నట్లు తాజాగా వెల్లడించింది. తన సినిమా ‘టైటానిక్’ సినిమాను ప్రేక్షకుడిగా థియేటర్లలో చూశాక మనుషులు.. జీవితం అంతకంటే ముఖ్యమని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే తన కొపాన్ని తగ్గించుకొని కూల్ గా మారిపోయారు. దాదాపు పుష్కరం తర్వాత జేమ్స్ కామెరూన్ అవతార్ 2తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ఎలాంటి రికార్డులు నెలకోల్పుతుందోననే ఆసక్తి నెలకొంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News