ఎన్నాళ్ళ నుండో వేచి చేస్తున్న ఆ భారీ బ్లాక్ బస్టర్ మూవీ ''జనతా గ్యారేజ్'' అంటూ వెయిట్ చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అందుకే మొన్న ఫ్యాన్స్ చాలా ఆనందంగా చెప్పుకుంటున్న "Jr NTR ను తిరగేస్తే ఆర్ అంటే రభస.. టి అంటే టెంపర్.. ఎన్ అంటే నాన్నకు ప్రేమతో.. జె అంటే జనతా గ్యారేజ్.." అంటూ ఆనందగా చెప్పుకున్నాడు.
ఇకపోతే ఈ సినిమాను ధియేటర్లలో రిలీజ్ చేయడానికి అన్ని విధాలుగా సెప్టెంబర్ 2 అనువైన సమయం అని ఆల్రెడీ కన్ఫామ్ చేసేశారు. ఇప్పుడు సినిమా ఫస్ట్ కాపీ కూడా దాదాపు రెడీ అయిపోయిందట. దర్శకుడు కొరటాల శివ ఇప్పుడు కాజల్ తో తీసిన ఐటెం సాంగును ఎడిట్ చేయిస్తున్నాడట. ఒక్కసారి అది పూర్తవ్వగానే.. సినిమాను మొత్తంగా లాక్ చేసి.. దేవిశ్రీప్రసాద్ ఫైనల్ అవుట్ పుట్ ఇవ్వగానే.. మనోళ్ళు వెంటనే సినిమాను సెన్సార్ కు పంపిస్తారట. ఆగస్టు 27న సెన్సారింగ్ కార్యక్రమం జరగబోతున్నట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అంటే ఆ రోజునుండే సినిమా రిలీజ్ కథ మొదలవబోతోంది.
టెంపర్ సినిమా హిట్టయినా కూడా దాని ప్రస్థానం 43 కోట్ల దగ్గరే ఆగింది. నాన్నకు ప్రేమతో 50 కోట్లు క్లబ్ లో చేరగానే సైలెంట్ అయిపోయింది. అందుకే ఈసారి ఎలాగైనా ఒక 70 కోట్ల రేంజ్ హిట్టు కొట్టాలని వెయిట్ చేస్తున్నాడు తారక్. చూద్దాం ఏం చేస్తాడో మరి.