బాహుబలి రిలీజ్ తరువాత టాలీవుడ్ కలెక్షన్ లెవెల్స్ లో చాలా తేడా వచ్చిందని అందరూ అనుకున్నాం. అయితే మహేష్ బాబు శ్రీమంతుడు తప్పిస్తే.. అస్సలు మళ్ళీ ఆ రేంజులో ఎవ్వర వసూలు చేయలేదు. బ్రూస్ లీ, సర్దార్ వంటి ఎక్సపెక్టేషన్లు ఉన్న సినిమాలన్నీపడుకున్నాయ్. ఇక సరైనోడు సినిమా కూడా ఒక 60 వరకు షేర్ వసూలు చేసే ఛాన్సుంది కాని.. మరీ 75-80 కోట్లంటే కష్టమే. కట్ చేస్తే..
ఇప్పుడు జూ.ఎన్టీఆర్ చాలా పెద్ద బాధ్యతను నెత్తి మీద వేసుకున్నాడు. ఇప్పటివరకు మనోడి కెరియర్ లో అత్యధికంగా వసూలు చేసింది 50 కోట్లు షేర్ మాత్రమే. మొన్ననే నాన్నకు ప్రేమతో సినిమాతో ఆ ఫీట్ సాధించాడు. ఇకపోతే ఇప్పుడు కొరటాల శివతో సినిమా చేస్తున్నాడు కాబట్టి.. అతగాడి శ్రీమంతుడు 80 కోట్లు వసూలు చేసింది కాబట్టి.. పంపిణీదారులు 'జనతా గ్యారేజ్' సినిమాను దాదాపు 68-70 కోట్ల రూపాయలతో కొన్నారు. కాని అంత మొత్తం రికవర్ చేయాలంటే మాత్రం కత్తి మీద సాము అనే చెప్పాలి.
ఇప్పటివరకు మహేష్ బాబు మాత్రమే సాధించిన ఆ ఫీట్.. ఆ తరువాత మళ్లీ మహేషే బ్రహ్మోత్సవంతో కొడతాడో లేదో తెలియని వేళ.. జూనియర్ మాత్రం చాలా సింపుల్ గా 70 కోట్లు కొట్టేస్తానంటున్నాడు. కాన్ఫిడెన్స్ ఉండటం మంచిదే కాని.. మరీ ఆ లెవల్ టార్గెట్ అంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి తారక్.