టీఆర్పీల రికార్డు కూడా గ్యారేజ్ దే

Update: 2016-11-07 09:53 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్-మలయాళ సూపర్ స్టార్ మోహ్ లాల్ నటించిన జనతా గ్యారేజ్ ఈ ఏడాది బిగ్గెస్ట్ గానే కాదు.. ఇండస్ట్రీ రికార్డుల్లో స్థానం సంపాచించింది. ఈ చిత్రానికి టీవీల్లో కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ అయిన 50 రోజులకే.. ఇంకా థియేటర్స్ లో సినిమా ఉండగానే.. టీవీలో ప్రదర్శించేయడం బాగా కలిసొచ్చింది.

జనతా గ్యారేజ్ కు 20.69 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఉన్న రికార్డులన్నీ తుడిచేసింది గ్యారేజ్. 2016 హైయెస్ట్ టీఆర్పీ సాధించిన మూవీగా ఎన్టీఆర్ మూవీ టాప్ ప్లేస్ లో స్థానం దక్కించేసుకుంది. దీనికి ముందు బిచ్చగాడు మూవీ 18 రేటింగ్ పాయింట్లు సాధించగా.. ఇప్పుడా రికార్డు ఎన్టీఆర్ సొంతమైపోయింది. అదే రోజు క్రికెట్ మ్యాచ్ ప్రసారం అవుతున్న సమయంలో జనతా గ్యారేజ్ టెలికాస్ట్ జరిగినా.. జనాల ఓటు గ్యారేజ్ కే పడ్డం విశేషం.

టీఆర్పీల విషయంలో ఇది ఎన్టీఆర్ కు కెరీర్ బెస్ట్ అనాల్సిందే. ఇప్పటివరకూ ఎన్టీఆర్ నటించిన ఏ మూవీ కూడా 20 పాయింట్ల మార్క్ని టచ్ చేయలేదు. అటు సిల్వర్ స్క్రీన్ పైనే కాదు.. ఇటు స్మాల్ స్క్రీన్ పై ఎన్టీఆర్ సత్తా చాటడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News