బాలీవుడ్ యువనటి జాన్వీకపూర్ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. తాజాగా ఈ కుర్రభామ ప్రతి యాక్టర్ 'సెల్ఫ్ డౌట్' అనే అంశం ఫేస్ చేస్తున్నారని.. అలాగే సెల్ఫ్ డౌట్ (తమని తాము సందేహించుకోవడం)తో ఇంకా బెటర్ గా నటించడానికి ఉపయోగపడుతుందని జాన్వీ చెప్పుకొచ్చింది. దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కూతురుగా జాన్వీ 2018లో దడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ ఆ సినిమా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తర్వాత జాన్వీ నుండి 'ఘోస్ట్ స్టోరీస్', 'గుంజన్ సక్సెనా: ది కార్గిల్ గర్ల్' అనే సినిమాలు విడుదలయ్యాయి. అవి రెండు సినిమాలు ఓటిటిలో విడుదలై జాన్వీకి మంచి క్రేజ్ తీసుకొచ్చాయి.
ఆ సినిమాలో తన నటనకు విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకుంది జాన్వీ. అయితే ఈ నేపథ్యంలో సెల్ఫ్ డౌట్ అనేది తనకు బాగా పనిచేసిందని చెబుతోంది. సెల్ఫ్ డౌట్ అనేది యాక్టింగ్ లో ఓ భాగం. అందరూ ఇలా అలోచించి వారి నటనను మెరుగు పర్చుకుంటున్నారనే నేను నమ్ముతున్నాను. నేను కూడా ఆ విధంగానే ట్రై చేస్తున్నాను అంటోంది అమ్మడు. ప్రస్తుతం జాన్వీ తాజాగా నటించిన హారర్ కామెడీ రూహి మూవీ విడుదల కోసం ఎదురుచూస్తోంది. తను జానర్స్ గురించి ఆలోచించట్లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. "నేను పనిచేయాలనుకునే దర్శకులు చాలామంది ఉన్నారు. అందుకే జానర్స్ గురించి ఆలోచిస్తానో లేదో కానీ.. కథానుగుణంగా సినిమాలు చేయాలనీ అనుకుంటున్నాను" అంటోంది జాన్వీ.