కూతురిని అతిగా పొగిడేస్తే విడ్డూర‌మ‌న్న జాన్వీ

Update: 2022-10-16 12:08 GMT
జాన్వీ కపూర్ నటించిన సర్వైవర్ థ్రిల్లర్ `మిలీ` త్వరలో విడుద‌కానుంది. ఇందులో తండ్రి కూతుళ్లు బోనీక‌పూర్- జాన్వీ క‌పూర్ ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు లాంచ్ అయింది. ఈవెంట్ లో జాన్వీ కపూర్  ఆమె తండ్రి బోనీ కపూర్ న‌డుమ సంభాషణ హాట్ టాపిక్ గా మారింది. జాన్వీ కపూర్ తన తండ్రిని ఎక్కువగా ప్రశంసించకుండా ఆపడానికి ప్రయత్నించ‌డం ఫ‌న్ క్రియేట్ చేసింది. అయితే నాన్న నిర్మాత బోనీ కపూర్ మాత్రం త‌న పొగ‌డ్త‌ల‌కు ప‌డిపోలేదు.

వేదిక‌పై బోనీకపూర్ ర‌క‌ర‌కాల ప్ర‌శ్న‌లు ఎదుర్కొన్నాడు. తన కుమార్తె జాన్వీ కపూర్ గురించి ఎంతగా గర్విస్తున్నారో ప్ర‌శ్నించ‌గా.. మిలీలో ఆమె నటన అద్భుతంగా ఉందని బోనీ కపూర్ ప్రశంసిస్తూ ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు అని కూడా పేర్కొన్నాడు. జాన్వీ సినిమా నుండి సినిమాకి ఎదుగుతోందని బోనీ ప్రశంసించారు. ఈ చిత్రం ఆమెను శిఖరాగ్రానికి చేర్చిందని శ్రీదేవి కుమార్తెగా త‌న‌పై ఉన్న‌ భారాన్ని అధిగమిస్తుందని అతను చెప్పాడు.  బోనీ కూడా ఈ సినిమా నిర్మాత‌ల‌లో ఒక‌రిగా ఉన్నారు.

బోనీ కపూర్ మాట్లాడుతూ-``ధడక్ తో ఘ‌నంగా ప్రారంభమైంది. గుంజన్ గా బాగా న‌టించింది. ఆపై అంటూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంది`` అని అన్నారు. అయితే ``పాపా తారీఫ్ బాస్ కరో ఆడ్ లగ్తా హై జబ్ ఫాదర్`` అంటూ జాన్వీ అతడిని క్యూట్ గా ఆపేందుకు ప్రయత్నించింది. నాన్నా దయచేసి అతిగా పొగడటం మానేయండి.. నాన్న మెచ్చుకుంటే విడ్డూరంగా ఉంటుంది అంటూ ఆపే ప్ర‌య‌త్నం చేసింది.

వాస్తవాలు చెప్పడంలో తప్పు ఏమిటీ? అని అత‌డు తిరిగి త‌న‌య‌ను అడిగాడు. జాన్వీ అతనిని అనుమతించింది. సరే క్షమించండి.. అచా తీక్ హై! అని అంది. తండ్రీ కూతుళ్ల మధ్య ఈ సాన్నిహిత్యం ఈవెంట్ లో బోలెడంత ఫ‌న్ క్రియేట్ చేసింది. అంద‌రినీ న‌వ్వించింది. మిలీ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. వెబ్ లో వేగంగా దూసుకెళుతోంది.
Tags:    

Similar News