బాలీవుడ్ లో కొంతమంది భామలు రెగ్యులర్ గా వార్తల్లో ఉండాలని ఆరాటపడతారు. అలా ఉంటేనే అవకాశాలు వస్తాయన్న ఆలోచన కూడా ఉంటుంది. అందుకే ప్రతి విషయంలో తమ సందడి అందరికి తెలిసేలా చేస్తారు. స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారైతే ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు. మీడియా అటెన్షన్ మొత్తం వారి మీదే ఉండేలా చూసే బాలీవుడ్ స్టార్స్ లో శ్రీదేవి తనయ జాన్వి కపూర్ ఒకరు. వరుస సినిమాలతో సందడి చేస్తున్న అమ్మడు రెగ్యులర్ గా వార్తల్లోనూ ఉంటుంది.
రీసెంట్ గా మిలి సినిమా ప్రమోషన్స్ కోసం మరింతగా చురుగ్గా పాల్గొన్నది జాన్వి. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కా జాన్వి సినిమా ప్రమోషన్స్ చేస్తూ వచ్చింది. హీరోయిన్ గా నటించడమే కాదు ప్రమోషన్స్ లో కూడా తను పాల్గొంటూ సినిమాకు సపోర్ట్ గా నిలుస్తుని. మిలి సినిమా తండ్రి బోనీ కపూర్ నిర్మించడం వల్ల సినిమా మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించింది జాన్వి కపూర్. ఫ్రైడే రిలీజైన మిలి సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆల్రెడీ మళయాళ వర్షన్ చూసిన ఆడియన్స్ కి ఈ సినిమా అంతగా ఎక్కకపోవచ్చు.
సినిమా ప్రమోషన్స్ కోసమో లేక రెగ్యులర్ గానో కానీ లేటెస్ట్ గా తన లెహంగా కాస్టూం తో ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది జాన్వి కపూర్. వెస్ట్రెన్ డ్రెస్ లో ఊపేయడమే కాదు ఇలా రెగ్యులర్ గాగ్రాలతో కూడా అలరిస్తుంది జాన్వి కపూర్. అమ్మడిని ఈ డ్రెస్ లో చూసిన ఆమె ఫాలోవర్స్ రంగు రంగు రెక్కల సీతాకోక చిలుకలా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలైతే చేస్తున్నా కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న జాన్వికి మిలి కొద్దిగా ఉత్సాహాన్ని ఇచ్చింది.
జాన్వి కపూర్ కి తెలుగు సినిమాల్లో కూడా నటించాలని ఆసక్తి ఉంది. ఆ విషయాన్ని రీసెంట్ గా హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా బయట పెట్టింది. ఇక్కడ స్టార్ హీరోల మీద కన్నేసిన అమ్మడు తారక్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఓపెన్ గా చెప్పేసింది. ఎన్.టి.ఆర్ 30వ సినిమా కోసం జాన్వితో డిస్కషన్స్ నడుస్తున్నాయని తెలుస్తుంది. అదే నిజమైతే మాత్రం ఎన్.టి.ఆర్, శ్రీదేవి కాంబోలానే తారక్, జాన్వి కాంబో క్రేజీగా మారబోతుంది. సినిమాలతోనే కాదు తన రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ సోషల్ మీడియా ఫాలోవర్స్ ని కూడా అలరిస్తూ వస్తున్న జాన్వి కపూర్ నార్త్ తో పాటుగా సౌత్ ఆడియన్స్ కూడా తన బుట్టలో వేసుకోవాలని ఫిక్స్ అయ్యింది.