ఇప్పుడంతా సోషల్ మీడియా కాలం. ఎవరికి వారు తమకు తోచినట్లుగా విషయాల్ని చెప్పేసే తీరు ఎక్కువైంది. టాలీవుడ్ లో సంచలన హీరోగా ఇమేజ్ ఉన్న విజయ్ దేవరకొండను ఫ్యాన్స్ మాత్రం ముద్దుగా 'రౌడీ'గా పిలుచుకోవటం తెలిసిందే. అతగాడి కెరీర్ లో అత్యంత భారీగా నిర్మించిన పాన్ ఇండియా మూవీ 'లైగర్' విడుదల కావటం.. ఫలితం తేలిపోవటం తెలిసిందే.
ఈ మూవీలో తొలుత అనన్య పాండే పాత్రకు అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ను అనుకోవటం తెలిసిందే. ఈ మూవీ ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు పూరీ జగన్నాద్ ఇదే విషయాన్ని ప్రస్తావించటం తెలిసిందే. లైగర్ లో విజయ్ కు జోడీగా జాన్వీని అనుకున్నామని.. ఆమెను సంప్రదించిన విషయాన్ని చెప్పారు.అయితే.. ఆ టైంలో తను బిజీగా ఉండటంతో మూవీని చేయలేనని చెప్పినట్లుగా పేర్కొన్నారు.
జాన్వీ నో చెప్పిన తర్వాత కరణ్ జోహార్ కు అదే విషయాన్ని చెబితే.. ఆయన సూచన మేరకు అనన్య పాండేను తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇక్కడి వరకు పూరీ చెప్పిందే మేం చెప్పాం. ఇక్కడి నుంచి మాత్రం సోషల్ మీడియాలో జరుగుతున్న విశ్లేషణను చెబుతున్నాం. పూరీ చెప్పినట్లే.. లైగర్ లో హీరోయిన్ పాత్ర కోసం జాన్వీని అడిగినప్పుడు.. ఆమెకు స్క్రిప్ట్ ఇవ్వడం కానీ.. కథను నేరేట్ చెప్పినప్పుడు కానీ తానీ మూవీకి ఓకే చెబితే తాను నష్టపోతానన్న విషయాన్ని జాన్వీ గుర్తించినట్లుగా చెబుతున్నారు.
నిజానికి విజయ్ దేవరకొండ మీద తనకు క్రష్ ను జాన్వీ దాచుకోలేదు. ఈ మధ్యనే ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా డేటింగ్ కు ఎవరితో వెళ్లేందుకు రెఢీ అంటే రౌడీ పేరును చెప్పేసిన సంగతి తెలిసిందే. అంతటి ఇష్టమున్న హీరో మూవీలో.. హీరోయిన్ రోల్ కు నో చెప్పటం వెనుక.. పూర్ క్యారెక్టర్ అన్న విషయాన్ని గ్రహించి తెలివిగా తప్పుకుందన్న మాట వినిపిస్తోంది. ఈ వాదనకు తగ్గట్లే.. లైగర్ లో హీరోయిన్ పాత్ర పైనా పెద్ద ఎత్తున విమర్శలు రావటం.. ఆ పాత్రతో అనన్య పాండేకు ఇసుమంత లబ్థి చేకూరలేదన్న మాట ఓపెన్ గానే చెప్పేస్తున్నారు.
ఇదంతా చూసినప్పుడు.. లైగర్ స్క్రిప్టుతో తనకు ఎలాంటి లాభం లేకపోగా.. నష్టం వాటిల్లుతుందన్న విషయాన్ని గ్రహించిన జాన్వీ తెలివిగా ప్రాజెక్టు నుంచి ఎస్కేప్ అయినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇదంతా చూస్తే.. పూరీ మీద నమ్మకంతో విజయ్ ఓకే చెబితే.. జాన్వీ మాత్రం ఎంతో ముందుచూపుతో స్క్రిప్టుకు నో చెప్పినట్లుగా విశ్లేషిస్తున్నారు. రౌడీతో డేటింగ్ కు సై అన్న జాన్వీ.. మూవీకి దెబ్బ పడిపోతుందన్న ఉద్దేశంతోనే తప్పుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. లాజిక్ ను ఫాలో అయితే.. ఈ వాదనలో నిజం ఉందనిపించటంతో పాటు.. జాన్వీ ఎంతో తెలివైనదన్న విషయం ఇట్టే అర్థమవుతుందన్న మాట వినిపిస్తోంది.