చెర్రీ కోసం డ్యాన్స్ మాస్టర్ పాట

Update: 2016-04-02 07:53 GMT
ఒక విభాగంలో సక్సెస్ అయిన వాళ్లు.. మరో డిపార్ట్ మెంట్ లో ట్యాలెంట్ చూపించడం సినిమా ఇండస్ట్రీలో సహజం. యాక్టర్లు సింగర్లుగా మారడం, రైటర్లు డైరెక్టర్లుగా మారడం, ఫైట్-డ్యాన్స్ మాస్టర్లు డైరెక్టర్లుగా మారడం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడో కొరియోగ్రాఫర్ కూడా సింగర్ అవతారం ఎత్తాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సింగర్ గా మారిపోయాడు. చెర్రీ పై ఓపాట పాడేసి విడుదల చేశాడు.

కానీ ఇది సినిమా కోసం కాకపోవడమే ఇక్కడ అసలు విషయం. నిజానికి జానీ మాస్టర్ పాడిన ఈ సాంగ్.. మార్చ్ 27న చెర్రీ పుట్టిన రోజు సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. కానీ సాంకేతిక ఇబ్బందులతో దీని రిలీజ్ లేట్ అయింది. మరి రామ్ చరణ్ పైనే జానీ మాస్టర్ పాట పాడ్డానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఈ కొరియోగ్రాఫర్ కు ఇండస్ట్రీలో మొదటి బ్రేక్ ఇచ్చినది చెర్రీనే. రచ్చ మూవీలో జానీ కంపోజ్ స్టెప్స్.. అభిమానుల కళ్లముందు ఇప్పటికీ కదులుతుంటాయి.

అంతే కాకుండా.. జానీ మాస్టర్ భార్య ప్రసవం సమయంలో చరణ్ చాలా సాయం చేశాడు. ఈ డ్యాన్స్ మాస్టర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలియడంతో.. అతని భార్యను అపోలో హాస్పిటల్స్ లో చేర్పించి, మొత్తం బిల్లులన్నీ తానే కట్టాడు రామ్ చరణ్. అప్పటి నుంచి 'నాకు అన్నీ రామ్ చరణే'  అంటూ ఉంటాడీ జానీ మాస్టర్.
Full View

Tags:    

Similar News