స్టార్‌ హీరో గుట్టు రట్టు చేసిన మాజీ భార్య

Update: 2018-11-11 01:30 GMT
హాలీవుడ్‌ లో స్టార్‌ కపుల్‌ విడాకులు విడాకులు తీసుకోవడం అనేది చాలా కామన్‌. తాజాగా హాలీవుడ్‌ స్టార్‌ హీరో బెన్‌ అప్లెక్‌ మరియు జెన్నీఫర్‌ గ్రానెర్‌ లు విడాకులు తీసుకున్నారు. వీరిద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. విడాకుల తర్వాత తన మాజీ భర్త పై జెన్నీఫర్‌ సంచలన ఆరోపణలు చేసింది. చాలా సంవత్సరాలు ఆయనతో విసిగి పోయాను - ఎంతో కాలం ఆయన మారుతాడని ఎదురు చూశాను. విడాకుల తర్వాత జెన్నీఫర్‌ చేసిన సంచలన ఆరోపణలతో బెక్‌ అప్లెక్‌ పరువు గంగలో కలిసి పోయింది.

చాలా కాలంగా బెక్‌ - జెన్నీఫర్‌ ల మద్య విభేదాలు ఉన్నాయని - అవి ప్రస్తుతం తారా స్థాయికి చేరడంతో ఇద్దరు కోర్టు ద్వారా విడాకులు పొందినట్లుగా హాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బెన్‌ శృంగార లీలలు - పాడు పనుల వల్లే జెన్నీఫర్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. జెన్నీఫర్‌ కూడా అదే విషయాన్ని చెప్పకనే చెబుతోంది. తన మాజీ భర్త మోడల్‌ ఎమిలీ మరియు నటి ఔజినియన్‌ తో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని - మద్యానికి బానిసై అక్రమ సంబంధాలు చాలా పెట్టుకున్నాడని జెన్నీఫర్‌ చెప్పుకొచ్చింది.

ఆయన అక్రమ సంబంధాలను తట్టుకోలేక తాను ఆయన నుండి విడాకులు తీసుకున్నాను. ఆయన ఏ స్థాయికి దిగజారాడు అంటే తనకు వైధ్యం అందించేందుకు వచ్చిన ఒక నర్స్‌ తో కూడా సంబంధం పెట్టుకున్నాడు అంది. బెన్‌ - జెన్నీఫర్‌ లకు ఒక పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడికి తండ్రి అవసరం ఉంది కనుక విడాకులు తీసుకున్నా కూడా బెన్‌ తో స్నేహంగా ఉండాలని భావిస్తున్నాను అని, ఆయన ఎలా స్వీకరిస్తాడో ఆయన ఇష్టమని జెన్నీ చెప్పుకొచ్చింది. జెన్నీ వ్యాఖ్యలతో బెన్‌ అప్లెక్‌ కు చాలా డ్యామెజీ ఖాయం అంటూ హాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతుందట.

Tags:    

Similar News