పరువు తీయోద్దంటూ అమ్మ వార్నింగ్‌ ఇచ్చింది

Update: 2019-01-03 14:43 GMT
శ్రీదేవి కూతురు అవ్వడంతో జాన్వీ కపూర్‌ నటించిన మొదటి సినిమా ‘ధడక్‌’ ఫ్లాప్‌ అయినా కూడా మంచి గుర్తింపును అయితే దక్కించుకుంది. బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా జాన్వీ కపూర్‌ గుర్తింపు దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న జాన్వీ కపూర్‌ తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడి చేసింది. తన తల్లితో తనకు ఉన్న అనుబంధంతో పాటు, తన గురించి గతంలో మీడియాలో వచ్చిన పుకార్ల గురించి పూర్తి వివరాలను తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా కూడా పరిచయం కాకుండానే ప్రేమలో పడి, కొందరు కుర్రాళ్లతో కలిసి తిరుగుతూ వారితో చాలా క్లోజ్‌ గా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. శ్రీదేవి అంటే ఇండియాలోనే ఫేమస్‌ స్టార్‌. అలాంటి స్టార్‌ కూతురు ఇలా పలువురు కుర్రాళ్లతో తిరుగుతోంది అంటూ అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి. జాన్వీ కపూర్‌ ఇండస్ట్రీకి రాకముందే మూడు నాలుగు లవ్‌ స్టోరీలను మెయింటెన్‌ చేస్తూ బాలీవుడ్‌ నీళ్లు బాగానే ఒంట బట్టించుకుంది అంటూ కుప్పలు తెప్పలుగా వార్తలు వచ్చాయి. జాన్వీ కపూర్‌ ప్రేమ విషయాల గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతో శ్రీదేవి, బోణీ కపూర్‌ లు కూడా స్పందించారట.

జాన్వీ కపూర్‌ ఆ విషయమై మాట్లాడుతూ... నా గురించి మీడియాలో వచ్చిన వార్తలను చూసి అమ్మ, నాన్న నన్ను పిలిచి, ఎవరైనా ఇష్టం అయితే చెప్పు, అతడికే ఇచ్చి పెళ్లి చేస్తాం, అంతే తప్ప పరువు తీసే పనులు మాత్రం చేయవద్దని హెచ్చరించారు. ఆ సమయంలో వారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు. మీడియాలో వచ్చిన వార్తల గురించి తెలిసి వారికి క్లీయర్‌ గా చెప్పాను. వారంతా నా స్నేహితులు మాత్రమే అని, డేటింగ్‌ కు స్నేహంకు చాలా తేడా ఉందని వారికి అర్థం అయ్యేలా చెప్పాను. నాతో అప్పటి నుండి ఎవరు స్నేహం చేయాలనా, తిరగాలన్నా కూడా ఇప్పుడు భయపడుతున్నారంది. ఇలాంటివి ఎన్ని రూమర్స్‌ వచ్చినా కూడా నేను భయపడను. నేను ఎలా ఉండాలనుకుంటానో అలాగే ఉంటాను అంది. తల్లి మరణం నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చిన జాన్వీ కపూర్‌ గుంజన్‌ సక్సేనా బయోపిక్‌ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది.


Full View

Tags:    

Similar News