అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలు జాన్వీ `ధడక్` చిత్రంతో వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నమే నటిగా ఆకట్టుకుంది. ఆ క్రమంలోనే జాన్వీ నటించే తదుపరి చిత్రం ఏమిటో? అంటూ ఆసక్తిగా వేచి చూస్తున్నారంతా. ప్రస్తుతం కరణ్ జోహార్ నిర్మిస్తున్న భారీ హిస్టారికల్ చిత్రం తక్త్ (సింహాసనం)లో నటించేందుకు ఈ నటవారసురాలు రెడీ అవుతోంది. ఆ సంగతి కంటే ఈ అమ్మడి పబ్లిక్ అప్పియరెన్స్ గురించి.. రెగ్యులర్ ఫోటోషూట్ల గురించి యువతరం ఎక్కువ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
ఏదైనా సెలబ్రిటీ ఈవెంట్ కి వెళ్లినా.. పెళ్లి వేడుకలు ఇతరత్రా ఫంక్షన్లకు ఎటెండ్ అయినా.. లేదా జిమ్ కో.. మార్కెట్ కో వెళ్లినా జాన్వీ మెయింటెయిన్ చేసే డ్రెస్ కోడ్ పై ప్రత్యేకించి చర్చ సాగుతుంటుంది. ఇంటి నుంచి బయటపడడం ఆలస్య ం జాన్వీని చూసేందుకు ప్రత్యేకించి అభిమానులు తనని ఫాలో అయిపోతుంటారు. ముంబై బాంద్రా మొదలు ఖరీదైన ఏరియాల్లో హైఎలెర్ట్ ఉంటుంది. యోగ, జిమ్ చేసేప్పుడు టైట్ ఫిట్ డ్రెస్ లతో జాన్వీ మతి చెడగొడుతోంది. రెస్టారెంట్ .. క్లబ్.. పబ్ వంటి చోట్లకు వెళ్లినా తన డ్రెస్ కోడ్ చూస్తే మతి చెడాల్సిందే. ఈ వ్యవహారికం వల్లనే ముంబై మీడియా నిరంతరం తన చుట్టూ తిరిగేస్తూ ఫోటోల కోసం వెంపర్లాడుతుంటుంది.
నేటి (శనివారం) ఉదయం జాన్వి ఎప్పటిలాగానే జిమ్ కు వెళ్లిందట. తన వెంటే ఫోటోగ్రాఫర్లు కెమెరాలు తీసుకుని పరిగెత్తడంతో ఆ హడావుడి చూసి జాన్వీ కాస్తంత సీరియస్ అయ్యిందని తెలుస్తోంది. అంత సీరియస్ లోనూ నవ్వేస్తూ.. ``జిమ్ కు వెళ్తున్నానని కాదు. ఎక్కడికి వెళ్తున్నా మీరు ఫోటోలు తీస్తున్నారు కాబట్టి మీ కోసమే ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాను`` అని జాన్వీ అందిట. మొత్తానికి పరుగులు పెట్టించడంలోనే కాదు.. ఛమత్కారంగా మాట్లాడడంలోనూ మామ్ నుంచి చాలానే శిక్షణ తీసుకుందన్నమట!