ఫోటో స్టొరీ: జివ్వనిపిస్తున్న జూనియర్!

Update: 2018-11-04 10:57 GMT
అతిలోక సుందరి శ్రీదేవి ఈలోకం విడిచి పోయిందని రామ్ గోపాల్ వర్మ లాంటి వీరాభిమానులతో సహా ఎంతోమంది సాధారణ అభిమానులు ఫీలయ్యారు.. బాధపడ్డారు.  ఆమె లేని లోటు తీర్చలేనిదే అయినా ఆమె కూతురు జాన్వి కపూర్ ఆమె లేని లోటును తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. నటన విషయంలో శ్రీదేవితో  ఏ ఇతర హీరోయిన్లను.. అందులో ఈ జెనరేషన్ జూనియర్లను పోల్చడం భావ్యం కాదు కాబట్టి అది పక్కన పెడదాం.  గ్లామర్ విషయంలో జాన్వి మాత్రం అతిలోక సుందరి 2.0 లాగా అనిపిస్తోంది.

రీసెంట్ గా జాన్వీ బాంద్రా ఏరియాలో జిమ్ నుండి ఇంటికి వెళ్తూ మీడియా కంటబడింది.  జిమ్ లో కసరత్తులంటే బిగుతైన స్పోర్ట్స్ వేర్ లో దర్శనమిస్తారు కదా ఆలాంటి డ్రెస్ లోనే కనబడి అందరి మతులు పోగొట్టింది. నేవీ బ్లూ టీ-షర్ట్ దానికి కాంబినేషన్ లో లైట్ బ్లూ కలర్ లో ప్యాంట్. లూజ్ హెయిర్.. చేతిలో పెద్ద బ్యాగ్.  ఇది ఆమె గెటప్.  ఇక ఫుల్ గా డ్రెస్ వేసుకున్నా యమ హాటుగా ఉంది. మీడియా వాళ్ళు ఫోటోలు తీస్తున్నారని ఫోన్ తీసి నేలకేసి కొట్టే బాపతులా కాకుండా ఒక చిరునవ్వు రువ్వుతూ ఎంతో ప్రశాంతంగా కారెక్కి కూర్చుంది. ఈ విషయంలో మమ్మీ శ్రీదేవిని గుర్తు తెచ్చేసింది.

ఇక సినిమాల విషయానికి వస్తే కరణ్ జోహర్ బ్యానర్ లో 'ధడక్' సినిమా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తన రెండో చిత్రాన్ని కూడా కరణ్ జోహార్ బ్యానర్ లోనే చేస్తోందట. జాన్వి మొదటి సినిమా కంటే పెద్ద హిట్ ను అందిస్తానని.. జాన్వి  కెరీర్ విషయంలో శ్రీదేవి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానని కరణ్ జోహార్ అంటున్నాడని బాలీవుడ్ టాక్.
Tags:    

Similar News