‘ఘర్షణ’కు సీక్వెల్ రెడీ అయింది

Update: 2016-09-28 19:30 GMT
బాలీవుడ్లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అక్షయ్ కుమార్.. అజయ్ దేవగన్ లాంటి హీరోలు రూటు మార్చి కామెడీలు చేయడం మొదలుపెట్టాక అక్కడ రెగ్యులర్ గా యాక్షన్ సినిమాలు చేసే హీరోలు తగ్గిపోయారు. ఈ లోటును జాన్ అబ్రహాం అప్పుడప్పుడూ తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. గత కొన్నేళ్లలో అతను ఫోర్స్.. రాకీ హ్యాండ్సమ్ లాంటి యాక్షన్ సినిమాలు చేశాడు. ఇప్పుడు ‘ఫోర్స్-2’తో రాబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ‘ఫోర్స్’ తరహాలోనే ఇందులోనూ భీభత్సమైన యాక్షన్ ఉంటుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఫోర్స్ అప్పట్లో మంచి విజయమే సాధించింది.

‘ఫోర్స్-2’లో జాన్ అబ్రహాం రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. నిజానికి సినిమా పేరు ‘ఫోర్స్-2’ కాదు.. ఫోర్స్ స్క్వేర్. తొలి భాగం కంటే యాక్షన్ డోస్ ఇందులో ఎక్కువే ఉంటుందట. ‘ఫోర్స్’ తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ‘కాక్క కాక్క’కు రీమేక్. ఆ సినిమానే తెలుగులోకి ‘ఘర్షణ’ పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ‘ఫోర్స్’లో జాన్ అబ్రహాం సరసన జెనీలియా నటించింది. సీక్వెల్లో అతడితో సోనాక్షి సిన్హా జత కడుతోంది. ఢిల్లీ బెల్లీ.. గేమ్ లాంటి సినిమాలు తీసిన అభినయ్ డియో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఫోర్స్ స్క్వేర్’ అని పేరు పెట్టుకున్నారు కానీ.. తొలి భాగానికి భిన్నంగా ఈ కథ సాగుతుందట. నవంబరు 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags:    

Similar News