ట్రైలర్ టాక్: సీరియస్ కేస్ లో జాలీ

Update: 2016-12-19 09:14 GMT
బాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలకు కొదువ ఉండదు. దాదాపుగా సీక్వెల్స్ అన్నీ హిట్స్ సాధిస్తుండడంతో.. గతంలో సెన్సేషన్ సృష్టించిన మూవీస్ ని అదే టైటిల్ తో మళ్లీ తెరపైకి తెచ్చేస్తున్నారు. మూడేళ్ల క్రితం అర్షద్ వర్సీ.. బొమన్ ఇరానీ.. అమృతా రావులు నటించిన జాలీ ఎల్ఎల్‌బీకి సీక్వెల్ ఇప్పుడు రిలీజ్ రెడీ అవుతోంది. జాలీ ఎల్ఎల్బీ2 టైటిల్‌ పై తెరెకక్కడమే కాదు.. ఇప్పటికే దాదాపు షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడీ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా.. అక్షయ్ కుమార్ లీడ్ రోల్ చేయడంతో ప్రతీ ఫ్రేమ్ ఆకట్టుకుంటోంది.

జగదీశ్వర్ మిశ్రా అనే లాయర్.. ఎప్పుడూ కోర్టులో చివాట్లు తింటూనే ఉంటాడు. మెడ పట్టుకు గెంటేయమని జడ్జ్ ఆర్డర్స్ కూడా పాస్ చేస్తాడు. అలా ఎప్పుడూ గెలుపు అనేదే అంతగా తెలియని అక్షయ్ కు.. ఓ సీరియస్ మర్డర్ కేస్ వాదించాల్సి వస్తుంది. అధికారం..  డబ్బు.. అవినీతిలకు వ్యతిరేకంగా పోరాడాల్సి వస్తుంది. అయినా సరే హుమా ఖురేషీ కోరిక.. తనకు తెలిసిన వాస్తవాలను బేస్ చేసుకుని ఈ కేసును టేకప్ చేస్తాడు అక్షయ్.

రిజల్ట్ ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద విషయం కాదు కానీ.. చెట్టు కింద ప్లీడర్ రేంజ్ ఉన్న ఓ లాయర్.. అంత పెద్ద క్రైమ్ నెట్వర్క్ ను ఎలా ఛేదించాడన్నదే మూవీ. అటు కామెడీలోను.. ఇటు సీరియస్ సీన్స్ లోను బాలీవుడ్ ఖిలాడీ కుమ్మేశాడంతే. ఫిబ్రవరి 10.. 2017న జాలీ ఎల్ఎల్బీ2 థియేటర్లలోకి రానుంది.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News