సంజయ్ దత్ బయోపిక్ ‘సంజు’ బాక్సాఫీస్ దగ్గర ఇరగాడేస్తుండొచ్చు. వసూళ్ల వర్షం కురిపిస్తుండొచ్చు. కానీ ఇందులో సంజయ్ జీవితాన్ని చూపించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమ్యాయి. గొప్ప గొప్ప సినిమాలతో గ్రేట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రాజ్ కుమార్ హిరాని.. బాలీవుడ్ లో అత్యంత వివాదాస్పదుడిగా గుర్తింపు తెచ్చుకున్న సంజయ్ దత్ ను సినిమాలో ఉత్తముడిగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించడం విమర్శలకు దారి తీసింది. మారణాయుధాల కేసు దగ్గర్నుంచి దత్ జీవితంలోని ప్రతికూల సంగతులన్నింటి గురించి కూలంకషంగా తెలిసిన వాళ్లు సోషల్ మీడియాలో ఈ సినిమాను ఉతికారేస్తున్నారు. ఈ క్రమంలోనే ముంబయికి చెందిన సీనియర్ క్రైమ్ రిపోర్టర్ బల్జీత్ పార్మర్ లైన్లోకి వచ్చాడు.
1993 - ఏప్రిల్ 14న సంజయ్ వద్ద అక్రమ ఆయుధాలు ఉన్నాయన్న విషయాన్ని వెలుగులోకి తెచ్చింది బల్జీతే. ఈ కేసులో సంజయ్ కి శిక్ష పడటానికి పరోక్షంగా బల్జీతే కారణమని చెప్పాలి. ఆయన ‘సంజు’ సినిమాను చూడలేదట. ఇకముందూ చూడాలని అనుకోవట్లేదట. ‘సంజు’ సినిమా చూడమంటూ ఆయనకు వందలాది మెసేజులు వస్తున్నాయట. కానీ తనకు ఆ ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ సినిమాకు గట్టిగా చురకలు అంటించారు. ‘‘నేను సినిమాలు చూసి చాలా కాలమైంది. ఈ బయోపిక్ లు నటీనటులకు ఎలాంటి మచ్చ రాకుండా వారిని మంచివారిగా చూపించడానికే తీస్తుంటారు. ప్రేక్షకుల్లో స్ఫూర్తి నింపడం కోసం కాదు. మాదకద్రవ్యాలను వాడటం.. ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవడం.. మీడియాను తక్కువ చేసి మాట్లాడటం.. చేసిన తప్పులకు పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవడం.. ఇలాంటి విషయాలన్నీ ‘సంజు’ సినిమాలో చూపించలేదని తెలిసింది. అందుకే సినిమా చూడకూడదని నేను తీసుకున్న నిర్ణయమే ఉత్తమం’’ అని బల్జీత్ పేర్కొన్నారు. హిరాని సంజయ్ దత్ కథను ఎంత వక్రీకరించి తీశాడో చెప్పడానికి ఈ వ్యాఖ్యలు చాలవూ.