వీడియో టాక్: గ్రౌండ్ లో జెర్సీ కష్టాలు

Update: 2019-03-30 06:05 GMT
న్యాచురల్ స్టార్ నాని జెర్సీ విడుదలకు ఇంకో 20 రోజుల సమయం మాత్రమే ఉంది. గత ఏడాది చేదు అనుభవాల దృష్ట్యా అభిమానులు ఈసారి దీని మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెరీర్ లో మొదటిసారి క్రికెటర్ పాత్ర పోషిస్తున్న నాని ఇందులో ఎంత కష్టపడ్డాడో వివరించేందుకు యూనిట్ జర్నీ అఫ్ జెర్సీ పేరుతో ఓ స్పెషల్ వీడియోని విడుదల చేసింది. ఇందులో చాలా డిటైల్డ్ గా జెర్సీ తెరవెనుక ఏం జరిగిందో రెండున్నర నిమిషాల్లో చూపించే ప్రయత్నం చేశారు.

70 రోజుల పాటు నాని ఏకధాటిగా క్రికెట్ ను ప్రత్యేకమైన కోచ్ సహాయంతో నెట్స్ లో ప్రాక్టీసు చేయడంతో మొదలుకుని షూటింగ్ స్పాట్ లో బాల్ తగిలి ముక్కుకు గాయమై రక్తం చిందించడం దాకా అన్ని ఇందులో పొందుపరిచారు. అంకెలతో కూడిన విశేషాలను కూడా ఇందులోనే షేర్ చేసుకున్నారు

మొత్తం 250 మంది కాస్ట్ అండ్ క్రూ జెర్సీ కోసం కష్టపడ్డారు. 5 డొమెస్టిక్ గ్రౌండ్లను ఎంపిక చేసి ప్రాక్టీసు తో పాటు షూటింగ్ కూడా అందులోనే చేశారు. మొత్తం 130 ఆట తెలిసిన క్రికెటర్లను వివిధ పాత్రల కోసం తీసుకున్నారు. వృత్తి రిత్యా ప్రొఫెషనల్స్ గా పేరున్న 18 మందిని పర్యవేక్షణ శిక్షణ కోసం వాడుకున్నారు.

24 గంటల పాటు సాగే గేమ్ బ్యాటిల్ నేపధ్యంగా కథలో కీలక భాగం ఉంటుందనే క్లూ కూడా ఇచ్చేశారు. నాని కోచ్ గా నటిస్తున్న సత్యరాజ్ తో పాటు హీరొయిన్ శ్రద్ధ శ్రీనాథ్ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ అలా కనిపించి ఇలా మాయమైపోతారు. మొత్తానికి ఫ్యాన్స్ కి ఉత్సాహం ఇచ్చేలా ఉన్న ఈ జెర్సీ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది


Full View
Tags:    

Similar News