బన్నీ - ఎన్టీఆర్.. బావ బంధం.. డైలాగ్స్ వరకే?

Update: 2023-04-08 23:06 GMT
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య స్నేహ సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది నిజంగా ఎంతో ఫ్రెండ్లీగా కొనసాగుతూ ఉంటారు ఇక మరి కొంతమంది బయటికి చెప్పుకోకపోయినా కూడా తరచుగా కలుసుకుంటూ ఉంటారు. అయితే మరి కొంతమంది హీరోల మధ్యలో మాత్రం ఎవరికీ తెలియని ఒక కోల్డ్ వారైతే నడుస్తుంది. పైకి చెప్పకపోయినా కూడా గతంలో చాలాసార్లు అది బయటపడింది.

ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ఇద్దరి మధ్యలో కూడా బావ అంటూ పలకరించుకున్న తీరును చూస్తూ ఉంటే ఇది ఓవర్గం ఫ్యాన్స్ కు బాగానే అనిపిస్తున్నప్పటికీ కూడా పక్క ప్రణాళికతో ఉంది అన్నట్లుగా కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్ డే బావ అంటూ ఎంతో వివరంగా తెలియజేశాడు.

ఇక అల్లు అర్జున్ వెంటనే నీ విషెస్ కు చాలా థాంక్యూ బావ.. బిగ్ హగ్స్ అని మరొక వివరణ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత కేవలం హగ్స్ మాత్రమేనా పార్టీ లేదా పుష్ప అంటూ ఆ సినిమాలోని డైలాగ్ చెప్పిన విధానం మరింత వైరల్ అయింది. అల్లు అర్జున్ అంతకంటే హైడోస్ పెంచుతూ వస్తున్నా.. అంటూ ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన డైలాగ్ కొట్టడంతో ఇది మరింత వైరల్ అవుతుంది.

అయితే వీరు చిట్ చాట్ చేసుకున్న విధానం చూస్తుంటే.. ప్లాన్ ఏమో అనిపిస్తోంది. వారి సినిమాలకు సంబంధించిన డైలాగ్స్ చెప్పుకోవడంతో ఇద్దరికీ కూడా ఒక విధంగా మీడియాలో మంచి ప్రమోషన్ కూడా. అయితే ఈ సమయంలో ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య పెరిగిన ఈ బావ పలకరింపు మరోవైపు అనేక రకాల డౌట్స్ క్రియేట్ చేస్తోంది. ఇది పక్కా ప్లాన్ తోనే ఇద్దరు అలా చాట్ చేసి ఉంటారని కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి.

అయితే మరోవైపు మెగా సైడ్ ఫ్యాన్స్ లో అనేక అనుమానాలు పుట్టించేలా చేస్తోంది. ఎన్టీఆర్ RRR ఉన్నప్పుడు తప్ప ఆ తరువాత చరణ్ తో పెద్దగా క్లోజ్ గా కనిపించింది లేదు. ఇక బన్నీ మెగా కాంపౌండ్ కి దూరంగా ఉన్నట్లు ప్రతీసారి టాక్ వస్తూనే ఉంటుంది. ఇక మొన్న చరణ్ పుట్టినరోజు అయితే అసలు తారక్ ఈ రేంజ్ లో విష్ చేయలేదు. ఇక అల్లు అర్జున్ అయితే సోషల్ మీడియాలో అసలే చేయలేదు. ఇక ఇప్పుడు నెగిటివ్ గాలులు ఎక్కువైన సమయంలో బన్నీ, తారక్ ట్విట్టర్ కామెంట్స్ వైరల్ అయ్యాయి. మరి వీరి బంధమైన సినిమాల డైలాగ్స్ వరకేనా కాస్త బయట కూడా అలానే కనిపిస్తారా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

Similar News