RRR చిత్రానికి ఆదిలోనే హంసపాదు! అంటూ ఇటీవల రెండు సార్లు షూట్ కి బ్రేక్ వేయడంపై ఆసక్తికర చర్చ సాగింది. ఓసారి రామ్ చరణ్ కి .. మరోసారి రామారావు (ఎన్టీఆర్)కి గాయాలయ్యాయి. దీంతో ఆ ఇద్దరి కోసం కొంత బ్రేక్ తప్పలేదు. షెడ్యూల్స్ ప్లానింగ్ లో స్వల్ప మార్పులు తప్పలేదు. అయితే ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ఫోకస్సివ్ గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాని 2019-20 మోస్ట్ అవైటెడ్ జాబితాలో చేర్చారు కాబట్టి అందుకు తగ్గట్టే ఏమాత్రం రాజీకి రాకుండా రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని ఎగ్జయిటింగ్ ఎలిమెంట్స్ తో తీర్చిదిద్దుతున్నారట. ఇటీవలే అమీర్ పేట సీఎం క్యాంప్ ఆఫీస్ పరిసరాల్లో ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ సాగింది.
అక్కడ సెట్స్ నుంచి తాజాగా ఓ లీక్ అందింది. ఆర్.ఆర్.ఆర్ ఫక్తు మాస్ యాక్షన్ ఫిలిం అంటూ సెట్స్ లో లైవ్ గా చూసిన వారు చెబుతున్నారు. ఈ చిత్రంలో క్లాస్ కంటే మాస్ ని మెప్పించే ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయిట. ఇద్దరు మాస్ హీరోలతో డబుల్ మాస్ ఏంటో చూపించాలన్న తాపత్రయం దర్శకధీరుడు రాజమౌళిలో ఎక్కువగా ఉందని చెబుతున్నారు. రాజమౌళి స్వతహాగానే మాస్. అందుకే ఆర్.ఆర్.ఆర్ ట్రిపుల్ మాస్ ట్రీట్ ఖాయమేనని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ ఎక్కడ జరుగుతోంది? అంటే.. RRR షూటింగ్ ప్రస్తుతం కోకా పేట్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఇక్కడ ఎన్టీఆర్ - రామ్ చరణ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. గత కొంతకాలంగా గాయాలతో షూటింగ్ కి దూరమైన చరణ్- ఎన్టీఆర్.. తిరిగి కోలుకుని ఉత్సాహంగా షూట్ లో పాల్గొంటున్నారట. భారీ యాక్షన్ సీన్స్ .. టిఫికల్ ఫైట్ సీన్స్ వల్లనే గాయాలయ్యాయి. ఫక్తు మాస్ యాక్షన్ కమర్షియల్ ఫిలిం ఇదని పదే పదే చెబుతున్నారు. ఇక దర్శకధీరుడు నెవ్వర్ బిఫోర్ యాక్షన్ సినిమాని చూపిస్తాడన్న ముచ్చటా సాగుతోంది. ఇండిపెండెన్స్ కి ముందు అల్లూరి సీతారామరాజు- కొమరం భీమ్ వీరులవ్వడానికి ఏం చేశారు? ఆ ఇద్దరూ హిస్టరీలో కలిసి వార్ నడిపించి ఉంటే ఎలా ఉండేది? అనేదే ఈ సినిమా కాన్సెప్ట్. చరిత్రకు ఫిక్షన్ జోడించి నభూతోనభవిష్యతి అన్న విధంగా రూపొందిస్తున్నారట. ఈ చిత్రాన్ని రాజమౌళి ఏ స్థాయిలో తెరకెక్కిస్తున్నారో తెలియాలంటే వచ్చే 2020 జులై 30 వరకు ఆగాల్సిందే.