‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఏ పాత్రలు పోషిస్తున్నారనే విషయంలో కొన్ని నెలల పాటు రకరకాల ఊహాగానాలు నడిచాయి. ఇందులో చరణ్ పోలీస్ అని.. ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నాడని.. అతను బీస్ట్ అవతారంలో కనిపిస్తాడని అన్నారు. ఈ సినిమా మొదలయ్యాక చరణ్ ఫిట్ గా కనిపిస్తుండటం, ఎన్టీఆర్ మాత్రం కొంచెం లావెక్కి చిత్రంగా తయారవడంతో ఈ ఊహాగానాలు నిజమే అన్న భావన కలిగింది. తీరా చూస్తే రాజమౌళి పెద్ద షాకే ఇచ్చాడు.
తన సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర చేస్తున్నాడని తెలిపాడు. ఇది ఒకే టైం పీరియడ్లో నడిచే సినిమా అన్నాడు. అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ అనగానే మనకు వాళ్ల రూపాలు ఓ రకంగా గుర్తుకొస్తాయి. కానీ జనాలకు వాళ్ల గురించి తెలియని.. ఓ ఫిక్షనల్ కథను చెప్పనున్నట్లు రాజమౌళి తెలిపాడు.
అలాంటపుడు హీరోల లుక్స్ విషయంలో కూడా రాజమౌళి లిబర్టీ తీసుకోవచ్చు. ఇద్దరినీ 20 ఏళ్ల వయసులోని యోధులుగా చూపించాలనుకుంటున్నాడు కాబట్టి ఫిట్‌గా చూపించడానికే ఫిక్సయి ఉంటాడు జక్కన్న. ఐతే నిన్నటి ప్రెస్ మీట్లో చూస్తే చరణ్ మాత్రం చాలా ఫిట్‌గా కనిపించాడు. అల్లూరి పాత్ర కోసం అతను ఆల్రెడీ మౌల్డ్ అయినట్లుగా కనిపించాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం అలా లేడు. అతను ‘జై లవకుశ’ టైంలో మాదిరి బొద్దుగా తయారయ్యాడు. ఫిట్నెస్ మీద అసలు దృష్టే ఉన్నట్లుగా లేదు. మరి ఇన్ని రోజులు జరిగిన చిత్రీకరణలో ఎన్టీఆర్ ఇలాంటి లుక్ తో ఎలా మేనేజ్ చేశాడా అన్నది ప్రశ్న. ఇకముందైనా తారక్ బరువు తగ్గి చరణ్ లాగా ఫిట్‌గా మారతాడా.. లేక మొత్తం కొమరం భీమ్ అనే వ్యక్తే బొద్దుగా ఉన్నట్లుగా ప్రొజెక్ట్ చేయబోతున్నారా అన్నది సందేహం. చరణ్ అలా ఉంటూ తారక్ ఇలా ఉంటే మాత్రం సినిమా రిలీజయ్యాక నెగెటివ్ కామెంట్లు పడటం ఖాయం.