బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న డార్క్ కామెడి చిత్రం 'జడ్జిమెంటల్ హై క్యా'. ఈ సినిమాకు మొదట్లో 'మెంటల్ హై క్యా' టైటిల్ పెట్టారు కానీ పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో టైటిల్ ను కొంచెం మార్చారు. ఈ సినిమాకు దర్శకుడు కె రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ కోవెలమూడి. అందరూ ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ మంగళవారం నాడు విడుదల అయింది.
ట్రైలర్ ప్రారంభం లోనే "మా పోలీసులు అందరికీ కోస్తారు.. కానీ ఈ ఇద్దరూ కలిసి మావి కోస్తున్నారు" అంటూ ఒక పోలీస్ డైలాగ్ వినిపిస్తుంది. ఇక ఒక మర్డర్ జరిగిన లోకేషన్ లో పోలీస్ "ఈ ఇద్దరిలోనే ఒకరు మర్డర్ చేసి ఉంటారు" అంటాడు. ఇక ఆ ఇద్దరు అనుమానితులు ఎవరంటే మొదటి సస్పెక్ట్ బాబీ(కంగనా) .. రెండవ సస్పెక్ట్ కేశవ్(రాజ్ కుమార్). ఇక కంగనా తన మెంటల్ యాటిట్యూడ్ తో రచ్చ చేసింది. అలారం మొగిందని దాన్ని కోపంగా దాన్ని కొట్టడం లాంటివి చేస్తుంది. సరదాకి పోలీసు డ్రెస్ కుట్టించుకుని తిరుగుతుంది. ఏదో నేరానికి "20 వేల ఫైన్ లేదా మెంటల్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ ఏది కావాలి?" అని అడ్వొకేట్ అడిగితే.. "మెంటల్ హాస్పిటల్ తీసుకోండి.. అక్కడ నేను కంఫర్టబుల్" అంటూ దిమ్మతిరిగే జవాబిస్తుంది.
మరోవైపు రాజ్ కుమార్ కూడా పిచ్చెక్కించే డైలాగ్స్ చెప్పాడు. కంగనా పోలీసులుకు.. రాజ్ కుమార్ గురించి వెజిటేరియన్ అని.. స్మోక్ చెయ్యడని చెప్తుంది. అదే పోలీసులు రాజ్ కుమార్ ను అడిగితే "అవును. నేను అబద్ధం చెప్పి సిగరెట్ కాల్చాను.. చికెన్ తిన్నాను.. అలా అని మీరు నన్ను హత్య కేసులో ఇరికిస్తారా?" అంటూ ఫైర్ అవుతాడు. అంతటితో ఆగకుండా "మీరు స్టేషన్ లో కూర్చొని ఈ ఆలూ భుజియా తింటూ ఉంటారని..మీ భార్యకు తెలుసా?" ఫినిషింగ్ టచ్ ఇస్తాడు.
రొటీన్ బాలీవుడ్ సినిమాలకు భిన్నంగా ఉందనే ఫీల్ ఇచ్చింది ఈ ట్రైలర్. కంగనా.. రాజ్ కుమార్ ఇద్దరూ అద్బుతమైన నటులు. తమ నటనతో ప్రేక్షకుల చూపును అటూఇటూ తిప్పుకోనివ్వరు. ట్రైలర్ చూస్తేనే ఇద్దరూ మరో సారి రెచ్చిపోయారని అర్థం అవుతోంది. ప్రేక్షకులకు ఈ సినిమాతో మెంటల్ ఎక్కించడం ఖాయం. ఆలస్యం ఎందుకు చూసేయండి. హిందీ అర్థం కాలేదు అంటే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఆన్ చేసుకోండి!
Full View