టాలీవుడ్ సినిమాలకు ప్రత్యేకంగా కొన్ని సీజన్ లు వుంటాయి. సమ్మర్, దసరా, సంక్రాంతి అంటూ మూడు సీజన్ లు వుంటాయి. చాలా వరకు క్రేజీ స్టార్స్, సీనియర్ హీరోలు ఈ సీజన్ లలో తమ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తూ వుంటారు. ఈ సీజన్ లలో తమ సినిమా రిలీజ్ చేస్తే పండగ సీజన్ కాబట్ట ప్రేక్షకులు అధిక సంఖ్యలో థియేటర్లకు రావడం వల్ల కలెక్షన్ లు భారీగా పెరిగే అవకాశం వుంటుంది. దీంతో ప్రతీ ఒక్క హీరో ఈ మూడు సీజన్ లని టార్గెట్ గా సినిమాలు రిలీజ్ చేస్తూ వుంటారు.
ఇప్పటికే ఈ ఏడాది సంక్రాంతి సీజన్ కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా ఆసక్తికరంగా సాగలేదు. దీంతో అందరి దృష్టి సమ్మర్ పై పడింది. సమ్మర్ లో రిలీజ్ అయిన RRR, కేజీఎఫ్ 2 సినిమాలు రికార్డు స్థాయి విజయాన్ని సాధించిన సంచలనం సృష్టించారు. ఇప్పడు దసరా వంతు వచ్చింది. అయితే ఈ సీజన్ లో భారీ స్థాయిలో సినిమాలు పోటీపడతాయని అంతా ఆశించారు కానీ అనూహ్యంగా ఇప్పటి వరకైతే మూడు సినిమాలు మాత్రమే బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇందులో ఇద్దరు సీనియర్ హీరోల సినిమాలు పోటీపడుతుంటే మధ్యలో చిన్న హీరో కూడా వీరితో పోటీకి రెడీ అయిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'గాడ్ ఫాదర్' మూవీ దసరాకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ హిట్ ఫిల్మ్ 'లూసీఫర్' ఆధారంగా ఈ మూవీని మోహన్ రాజా డైరెక్షన్ లో రీమేక్ చేశారు. తొలిసారి చిరంజీవి హీరోయిన్ లేకుండా ప్రయోగాత్మకంగా ఈ మూవీ చేస్తున్నారు.
ఈ మూవీతో పాటు సీనియర్ హీరో నాగార్జున కూడా 'ది ఘోస్ట్' మూవీతో బరిలోకి దిగుతున్నాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్, టీజర్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. ప్రత్యేకంగా క్రావ్ మగ, కటానా లో శిక్షణ తీసుకుని మరీ నాగార్జున నటించిన సినిమా ఇది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై భారీ స్థాయిలో బజ్ ని క్రియేట్ చేసింది. ఆక్టోబర్ 5న భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.
ఇదే సమయంలో అదే రోజున కొత్త హీరో బెల్లంకొండ గణేష్ 'స్వాతిముత్యం' సినిమాతో పోటీకి దిగుతున్నాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించారు. గత కొన్ని నెలలుగా వరుసగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఫైనల్ గా దసరా బరిలో నిలిచింది. మరి ఈ యంగ్ హీరో ఇద్దరు సీనియర్ మధ్య నలిగిపోతాడా? లేక గట్టెక్కుతాడా అన్నది వేచి చూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.