రష్మిక మందన్నా.. ఈ కన్నడ సోయగం గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. కన్నడ మూవీతో సినీరంగ ప్రవేశం చేసి, `ఛలో` వంటి సూపర్ హిట్ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పట్టిందల్లా బంగారమే అన్న చందంగా రష్మిక చేసిన చిత్రాలన్నీ మంచి విజయాలు సాధించాయి. దాంతో ఈ అమ్మడు అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల చెంత చేరి పోయి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది.
ప్రస్తుతం ఈ నేషనల్ క్రష్ తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ భాషల్లోనూ వరుస ప్రాజెక్ట్స్ ను టేకప్ చేస్తూ దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. రష్మిక తాజాగా ఓ భారీ ఫ్లాప్ నుంచి తప్పించుకుంది. అసలేం జరిగిందంటే.. న్యాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘జెర్సీ’ ని హిందీలో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించగా.. ఆయన భార్య పాత్రను బాలీవుడ్ నటి మృణాల్ ఠాకుర్ పోషించింది.
హిందీ వర్షన్‌కి కూడా తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరినే దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం ఏప్రిల్ 22న విడుదలై డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. `అర్జున్ రెడ్డి` రీమేక్ తో సూపర్ డూపర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న షాహిద్.. `జెర్సీ`తో కూడా అదే స్థాయి విజయం సాధించాలని, తన స్టార్ ఇమేజ్ను డబుల్ చేసుకోవాలని భావించారు. కానీ, ఆయన ఆశలన్నీ అడియాశలే అయ్యాయి.
ఇక ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించాలని మేకర్స్ మొదట రష్మికను సంప్రదించారట. కానీ, ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. ఎందుకు హిందీ జెర్సీని వదులుకోవాల్సి వచ్చిందో వివరించింది. ఆమె మాట్లాడుతూ.. `హిందీ జెర్సీ ఆఫర్ వచ్చినా వదులుకున్నాను. ఇది ఓ రియలిస్టిక్ చిత్రం. ఇప్పటి వరకు కమర్షియల్ సినిమాలు చేసిన నేను ఇందులో సూట్ అవుతానా అనే డౌట్ ఉంది. తెలుగు వెర్షన్లో శ్రద్ధా శ్రీనాథ్ అద్భుతంగా నటించారు. ఆ పాత్రకు తన కన్న గొప్పగా ఎవరు నటించలేరని నా ఉద్దేశం. అందుకే జెర్సీకి నో చెప్పా.` అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
దీంతో హిందీ జెర్సీని రిజెక్ట్ చేసి రష్మిక మంచి పని చేసిందని, బిగ్ ఫ్లాప్ నుంచి భలే తప్పించుకుందని నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రష్మిక ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఈమె తెలుగులో అల్లు అర్జున్ సరసన `పుష్ప ది రూల్` చేస్తోంది. హిందీలో `మిషన్ మజ్ను`, `గుడ్ బై`, `యానిమల్` చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ.. తమిళంలో విజయ్ దళపతి 66వ చిత్రానికి సైన్ చేసింది. అలాగే మలయాళంలో దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఓ లవ్ స్టోరీ చేస్తోంది.