ఫోటో స్టోరి: 'జ్వాల'లు రేపుతానంతే

Update: 2017-09-22 13:25 GMT

ఈ రోజుల్లో హీరోయిన్స్ హాట్ గా కనిపించడం సాధారణమైన విషయమే. మొదటి సినిమాల్లో ఉన్నట్టుగా హీరోయిన్స్ తరువాత చిత్రాల్లో ఉండడం లేదు. గ్లామర్ షోలతో రెచ్చిపోతున్నారు. అంతే కాకుండా అప్పుడప్పుడూ హాట్ ఫొటో షూట్స్ తో హల్ చల్ చేస్తున్నారు. అంతే కాకూండా ఘాటైన సెల్ఫీలను పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. అయితే ఆ గాలి ఇప్పుడు గ్రౌండ్లో ఆటతో ఆకట్టుకునే క్రీడాకారిణిలకు కూడా తగిలింది.

ఏ మాత్రం ఆలోచించకుండా వారు దిగే ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. మొన్న ఆ మధ్య భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ స్నేహితులతో కలిసి దిగిన ఫొటోలో ఘాటుగా కనిపించిందని క్లీవేజ్ చూపించిందని అనేక విమర్శలు వెలువడ్డాయి. ఇప్పుడు అదే తరహాలో ఇండియాన్ డబుల్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలా క్లివేజ్ షోతో కూడిన సెల్ఫీని దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అంతే కాకూండా ముందుగానే.. 'ద్వేషించే వాళ్ళు ద్వేషిస్తారు  అంటూ.. ముందు సెల్ఫీ దిగనివ్వండి' అనేలా కామెంట్ ని జతచేసింది. దానితో పాటు హేళన చేసేవారిని లెక్క చేయవద్దు అలాగే మిమ్మల్ని మీరు ఇష్టపడండి - ప్రేమని పంచండి. పాజిటివ్ గా ఉండండి అంటూ హ్యాష్ ట్యాగులు ఇచ్చేసింది. అంటే ఆ ఫొటో అందరికి నచ్చదని జ్వాలా ముందుగానే పసిగట్టిందన్నమాట.    
Tags:    

Similar News