పెద్దాయన మాట.. చిరు మెగాస్టార్ కాదు

Update: 2015-10-29 09:16 GMT
చిరంజీవి పేరును చిరంజీవిగా పలకాలంటే అదోలా ఉంటుంది. ఆ పేరు వెనుక మెగాస్టార్ చేరిస్తేనే ఆ పేరుకు ఓ అందం. రెండున్నర దశాబ్దాల నుంచి చిరంజీవిని అలాగే పిలుచుకుంటున్నారు అభిమానులు. సినిమాలకు గుడ్ బై చెప్పేసి.. రాజకీయాల్లోకి అడుగుపెట్టినా కూడా చిరును మెగాస్టార్ అనే పిలుచుకున్నారు. ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అవుతున్నపుడు కూడా అలాగే అంటున్నారు. ఐతే సీనియర్ దర్శకుడు విశ్వనాథ్ మాత్రం చిరు ఇంకెంతమాత్రం మెగాస్టార్ కాదంటున్నారు. రాజకీయ రంగ ప్రవేశంతో మెగాస్టార్ అనే మాట పక్కకు వెళ్లిపోయిందని చెబుతున్నారు.

రాజకీయాల్లోకి వెళ్లాక చిరంజీవి ఫ్యాన్ బేస్ బాగా దెబ్బ తిందని.. వీరాభిమానుల సంఖ్య బాగా తగ్గిందని.. కాబట్టి చిరు ఇప్పుడు మెగాస్టార్ కాదని అభిప్రాయపడ్డారు. మళ్లీ తన అభిమాన గణాన్ని తిరిగి తెచ్చుకోవడం కూడా చిరంజీవికి చాలా కష్టమని తేల్చేశారు విశ్వనాథ్. మళ్లీ వీర మాస్ సినిమాలు చేస్తే తప్ప అది సాధ్యం కాదన్నారు. తన 150వ సినిమాను చిరంజీవి తొలి సినిమాగా భావించి.. మళ్లీ కష్టపడితే తప్ప పోయిన ఫ్యాన్ బేస్ ను తిరిగి సంపాదించుకోలేడన్నారు. ఐతే ఇవన్నీ తన వ్యక్తిగత అభిప్రాయాలని చెప్పారు విశ్వనాథ్. ఈ లెజండరీ డైరెక్టర్ చిరంజీవితో స్వయంకృషి - ఆపద్బాంధవుడు లాంటి గొప్ప సినిమాలు తీసిన సంగతి తెలిసిందే.
Tags:    

Similar News