వర్మ పై కేసు పెట్టిన కేఏ పాల్ కోడ‌లు ..ఏమైందంటే ?

Update: 2019-12-10 04:47 GMT
రామ్ గోపాల్ వర్మ ..అలియాస్ వివాదాల వర్మ. నిత్యం వివాదాల తో స్నేహం చేయడం అయన నైజం. అయన రూటే సపరేటు. వర్మ ఏ సినిమా తీయాలని అనుకున్న కూడా టైటిల్ తోనే సినిమాకి భారీ హైప్ వచ్చేలా చూసుకుంటాడు. ఆ తరువాత సినిమాకి ప్రత్యేకంగా చేసే ప్రమోషన్ అక్కర్లేదు. ఎందుకు అంటే ఆ టైటిల్ ఎలాగూ సినిమా రిలీజ్ అయ్యే వరకు ప్రతి రోజు వార్తల్లో ఉంటుంది. ఇకపోతే వర్మ తాజా చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు ... ఈ సినిమా రిలీజ్ కి టైటిల్ అడ్డు రావడంతో ..వర్మ ఈ సినిమా పేరుని అమ్మ రాజ్యం లో కడప రెడ్లు గా మార్చారు.

ఆ తరువాత అన్ని సిద్ధం చేసుకొని రిలీజ్ కి సన్నధం అవుతున్న సమయంలో సెన్సార్ బృందం ఈ సినిమాకి బ్రేక్ వేసింది. దీనితో ఇక ఈ సినిమా రిలీజ్ కావడం కష్టం అనుకున్నారు. కానీ , వర్మ ఎలాగోలా సినిమాని కోర్టు సమస్యల నుండి బయటకి తెచ్చి రిలీజ్ కి సిద్ధం చేసారు. డిసెంబర్ 12న విడుదల కానుంది. ఇదే సమయం లో వర్మ చేసిన మరో తప్పు ..మళ్లీ సినిమాని మరో విఓవాదంలో పడేసింది. సినిమా డిసెంబర్ 12 న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో వర్మ సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ఫొటో చిక్కులు తెచ్చి పెట్టింది. వర్మకు..కేఏ పాల్ సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తున్న (మార్ఫింగ్) చేసిన ఫొటో వైరల్ అయ్యింది.

దీనిపై కేఏ పాల్ సహాయకురాలు జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా 2019, డిసెంబర్ 09వ తేదీ సీసీఎస్ సైబర్ క్రైమ్ కార్యాలయానికి చేరుకున్నారు. అమ్మరాజ్యంలో కడప బిడ్డలు సినిమా ప్రమోషన్‌లో భాగంగా..తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి వాడుకున్నారని, అభ్యంతకరంగా చూపించారని ఫిర్యాదులో తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో వర్మపై ఐపీసీ 469 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీ అడ్రస్ కోసం సీసీఎస్ పోలీసులు Google సంస్థ కు లేఖ రాశారు. చూడాలి మరి ఈ వివాదం నుండి వర్మ ఏ విధంగా బయట పడతారో ..


Tags:    

Similar News