వరుస భారీ చిత్రాలతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ అంతకంతకు వేడి పెంచేస్తోంది. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో 2.0 చిత్రాన్ని నిర్మించిన ఈ సంస్థ ప్రస్తుతం కమల్ హాసన్- శంకర్ కాంబినేషన్ లో అంతే భారీ బడ్జెట్ తో `భారతీయుడు 2` చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సంస్థ నుంచి మరో భారీ మల్టీస్టారర్ `కాప్పాన్` రిలీజ్ కి రెడీ అవుతోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్- గజిని సూర్య- ఆర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి `రంగం` ఫేం కె.వి.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. అఖిల్ ఫేం సయేషా సైగల్ ఈ చిత్రంలో డిటెక్టివ్ అవతారంలో కనిపిస్తోంది. అత్తారింటికి దారేది ఫేం బొమన్ ఇరానీ కార్పొరెట్ బిజినెస్ మేన్ గా నటిస్తున్నారు.
తాజాగా టీజర్ రిలీజైంది. కశ్మీర్ - సియాచిన్ (కార్గిల్) తీవ్రవాదానికి .. తమిళనాడు రాజకీయాలకు .. భారతదేశం సూపర్ పవర్ కావడానికి మధ్య ఉన్న లింకేంటి? అన్నది సస్పెన్స్ ఎలిమెంట్ గా దేశ రాజకీయాల్ని టచ్ చేస్తూ `కాప్పాన్` చిత్రాన్ని రూపొందించారని అర్థమవుతోంది. ఈ చిత్రంలో సూర్య తీవ్రవాదం ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే అతడు నాగలి పట్టి పొలం దున్నే రైతుగా.. గోవుల్ని కాసే గోపన్నగానూ కనిపించాడు. నదీ జలాల సమస్య గురంచి ప్రశ్న లేవనెత్తేవాడిగా టీజర్ లో కనిపిస్తున్నాడు. అంటే అసలు ఈ సినిమా థీమ్ ఏంటో అక్కడే అర్థమవుతోంది. గత కొంతకాలంగా తమిళనాడులో అల్లర్ల గురించి తెలిసిందే. కావేరీ నదీజలాల సమస్య తమిళనాడు - కర్నాటక మధ్య మంటలు రేపింది. దీనిపై పెను యుద్ధమే జరుగుతోంది. దాని పర్యవసానం తమిళనాడులో పంటలకు నీళ్లు లేని ధైన్యం నెలకొంది. దాంతో రైతన్నలు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. మోదీ ప్రభుత్వం రైతుల్ని విస్మరించిందని, నదీ జలాల విషయంలో న్యూట్రల్ గా ఉంటూ తమని నాశనం చేసిందనే ఆవేదనతో ఉన్నారు. చెత్త నిర్ణయాలతో తమిళనాడును భస్మీపటలం చేస్తోందన్న ఇష్యూపై రైతులు అలుపెరగని పోరాటం సాగిస్తున్నారు. అంటే ఒక రైతన్య ప్రభుత్వానికి ఎదురెళ్లి తీవ్రవాదిగా మారేంత అలజడి ఇది అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. ప్రభుత్వ ఆస్తుల విధ్వంసానికి పాల్పడే రైతు కథా ఇదీ? అన్న సందేహం కలగక మానదు. రన్నింగ్ ట్రైన్ పై బాంబులు పెట్టడం.. ఫ్లైఓవర్స్ కి బాంబులు పెట్టి పేల్చేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ చూస్తుంటే.. దేశ రాజకీయాల్ని పెద్ద ఎత్తున టచ్ చేస్తున్నారనే అర్థమవుతోంది.
పోరాడటం తప్పా? అని సూర్య ప్రశ్నిస్తుంటే నక్సల్స్ మార్గంలో పోరాడతావా? అంటూ తెలుగు నటుడు నాగినీడు సైతం ఆసక్తికరమైన పాత్రలోనే కనిపిస్తున్నారు. సూర్య రకరకాల గెటప్పులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇక ఇందులో ఆర్య స్టైలిష్ లవర్ బోయ్ లుక్ లో కనిపిస్తున్నాడు. అతడి రోల్ సీరియస్ పొలిటికల్ డ్రామాలో రిలీఫ్ నిస్తుందన్నమాట. ఇక సయేషా సీక్రెట్ ఏజెంట్ అవతారం ఆకట్టుకుంది. ఆసక్తికరంగా సయేషాకు ఆర్య లవ్ ప్రపోజల్ చూస్తుంటే.. రియల్ లైఫ్ లవ్ స్టోరిని ఈ సినిమాలో చూపించేశారా? అనిపించక మానదు. తమిళనాడును భస్మీపటలం చేస్తే ఇండియా సూపర్ పవర్ గా ఎదుగుతుందా? అన్న ప్రశ్న ఉత్కంఠ రేపేదే. హ్యారిస్ జైరాజ్ సంగీతం పెద్ద ప్లస్. ఓవరాల్ గా ఈ టీజర్ సూర్య - మోహన్ లాల్ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఆగస్టులో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.
Full View