తల్లిగా కాజల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Update: 2022-08-29 08:30 GMT
టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మాతృత్వపు అనుభూతిని ఆస్వాదిస్తూ ఉంది. అందమైన చందమామ కాజల్ అగర్వాల్ సినిమాల్లో ఎంత పాపులారిటీని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె దాదాపు పుష్కర కాలం పాటు టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా పెద్ద సినిమాల్లో నటిస్తూ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా నిలిచిన విషయం తెల్సిందే.

రెండేళ్ల క్రితం ప్రేమించిన వ్యక్తి గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి ప్రేమకు గుర్తుగా అన్నట్లుగా ఈ ఏడాదిలో వీరికి నీల్ కిచ్లు జన్మించాడు. తల్లిగా మారిన కాజల్ అగర్వాల్‌ చాలా మెచ్యూరిటీగా మాట్లాడటం తో పాటు తాను అమ్మను అయినందుకు అత్యంత సంతోషంగా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

గతంలో ఎన్ని సూపర్‌ హిట్స్ దక్కినా కూడా పొందని ఆనందం ఇప్పుడు కాజల్‌ అగర్వాల్ కి కలుగుతున్నట్లుగా ఆమె మాటలను బట్టి అర్థం అవుతుంది. సాదారణంగా గర్భవతిగా మహిళ చాలా కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఆ సమయంలో ఆరోగ్యపరమైన మానసిక సమస్యలు చాలానే ఉంటాయి. అయితే అవన్నీ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కనిపించకుండా పోతాయి.

ఇప్పుడు కాజల్ అగర్వాల్‌ కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చింది. నేను నా బిడ్డను ఎత్తుకున్న సమయంలో... నా బిడ్డను గుండెల మీద పడుకోబెట్టుకున్న సమయంలో నేను ఆ తొమ్మిది నెలలు పడ్డ కష్టాలు మరియు సవాళ్లు అన్ని కూడా కనుమరుగయ్యాయి. అంతే కాకుండా నా బిడ్డతో నేను ఉన్న సమయంలో ఈ ప్రపంచమే కనుమరుగయ్యిందా అనిపిస్తుంది.

ఇలాంటి ఫీలింగ్స్ ప్రతి తల్లి కూడా అనుభవిస్తూ ఉంటుంది. కాజల్ ఇప్పుడు ఆ అనుభూతిని ఆస్వాదిస్తూ తన యొక్క సంతోషంను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు మరియు తన వారితో షేర్‌ చేసుకుంటూ ఉంది.

మరో వైపు కాజల్ అగర్వాల్‌ రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మునుపటి రూపం కు వచ్చిన చందమామ బ్యూటీ మళ్లీ వరుస సినిమాలతో బిజీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News