అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు... రిలీజైన దగ్గర్నుంచి తెగ ఊపేస్తోంది ఈ పాట. మెగాస్టార్ చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 కోసం దేవీశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాట రిలీజ్ అవగానే వైరల్ కూడా అయిపోయింది. పాట స్టిల్స్ లో మెగాస్టార్ ఎప్పట్లాగే స్టైలిష్ గా కనిపిస్తుండగా.. కాజల్ అగర్వాల్ మరోసారి మాస్ గెటప్ తో అదరగొట్టేసింది.
చిరంజీవి పక్కన కాజల్ హీరోయిన్ అనగానే అందరికి ఏజ్ గ్యాప్ గుర్తొచ్చేసింది. సగం వయసు తేడా ఉంది జంటగా చూడటానికి ఎలా ఉంటారో అన్న అనుమానాలు వచ్చేశాయ్. కానీ చిరు- కాజల్ స్టిల్స్ బయటికొచ్చిన తర్వాత అందరి అనుమానాలు పటాపంచలైపోయాయ్. నిజం చెప్పాలంటే హీరోయిన్ కాజల్ కన్నా చిరునే ఇంకా యంగ్ గా ఉన్నారు. ఇక అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు లిరికల్ వీడియోలో కొత్త స్టిల్స్ చూసిన తర్వాత పాత మెగాస్టార్ కళ్ల ముందు కనిపించేశారు అభిమానులకి.
అలాగని కాజల్ తక్కువేమీ కాదు. ఇన్నాళ్ల కెరీర్ అంతా ఓ ఎత్తు. ఈ మధ్య మరో యాంగిల్ అన్నట్టు చెలరేగిపోతున్న కాజల్ ఖైదీ నెంబర్ 150లో హాట్ గానే కాదు ఘాటుగానూ కనిపిస్తోంది. లోకల్ గెటప్ కి వెస్ట్రన్ టచ్ ఇచ్చి అరిపించేసింది. లో- వెయిస్ట్ స్కర్ట్ మీద ట్రెడిషనల్ జాకెట్ దాని మీద బ్లాక్ జర్కిన్.. బ్లాక్ గాగూల్స్.. ఐ బ్రోస్ మీద స్టికర్స్.. షిమ్మర్ షూస్ ఇలా ఊరమాస్ గెటప్ తో పిచ్చెక్కించేస్తోంది కాజల్. రన్ ఎవే బ్రైడ్ లుక్ లో ఉన్న ఈ గెటప్ తన ఫేవరేట్ అంటోంది అమ్మడు.
ఇక స్టెప్స్ వేసేది చిరుతో కాబట్టి ఎలా మ్యాచ్ చేస్తుందో చూడాలి. ఒకవేళ మెగాస్టార్ ని కొంచెం అందుకున్నా చాలు కాజల్ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేయడం గ్యారంటీ అంటున్నారు. చూద్దాం ఈ దెబ్బకి మళ్ళీ లక్కు ఏమన్నా కలిసొస్తుందేమో పాపకి!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/