మామూలుగా ఓ హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తోందంటే.. ఆమె కెరీర్ క్లోజ్ అయిపోయినట్లే అనుకునేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మాంచి డిమాండింగ్ పొజిషన్లో ఉన్న హీరోయిన్లు సైతం ఐటెం పాటలకు స్టెప్పులేస్తున్నారు. శ్రుతి హాసన్.. తమన్నా.. ఐటెం సాంగ్స్‌తో మంచి పేరు సంపాదించగా.. తాజాగా ‘జనతా గ్యారేజ్’లో పక్కా లోకల్ పాటతో ఓ ఊపు ఊపేసింది చందమామ. ఇప్పటిదాకా స్టార్ హీరోయిన్లు చేసిన ఐటెం సాంగ్స్ అన్నిటికంటే దీనికి ఎక్కువ పేరు వచ్చిందనడంలో సందేహం లేదు. సినిమా ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా ఈ పాటను చెబుతున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఈ పాట బాగా ఆకర్షిస్తోంది.
కాజల్ ఈ పాట కోసం రూ.50 లక్షల పారితోషకం తీసుకోవడం టూమచ్ అన్నవాళ్లంతా ఇప్పుడు ఈ పాటకు వస్తున్న రెస్పాన్స్ చూసి ఆమెకా మొత్తం తక్కువే అనుకుంటున్నారు. మొత్తానికి తీసుకున్న పారితోషకానికి పూర్తి న్యాయమే చేసింది కాజల్. దీని తర్వాత కాజల్ కు మరిన్ని ఐటెం పాటల ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం. ఐతే ఆమె ఇంకా ఏదీ ఫైనలైజ్ చేయలేదు. మాంచి పారితోషకంతో ఐటెం సాంగ్స్ ఆఫర్ చేస్తుండటంతో ఆమె టెంప్ట్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఐతే వచ్చిన ఆఫర్లన్నీ ఓకే చెప్పకుండా ఒకటి రెండు పాటలకు కాజల్ ఓకే చెప్పొచ్చు. తెలుగులో హీరోయిన్ గా అవకాశాలు లేకపోయినా.. ఐటెం సాంగ్స్ తో ఇంకో రెండు మూడేళ్లు నెట్టుకొచ్చేయొచ్చు కాజల్. అంతలా ఉంది ఆమె డిమాండ్.