ఫొటోస్టోరీ: కాజ‌ల్ కొత్త సోకులు ఇవిగో..!

Update: 2016-12-20 05:55 GMT
నేను ప‌క్కా లోక‌ల్ అంటూ కాజ‌ల్ ఎప్పుడూ లేని రీతిలో `జ‌న‌తా గ్యారేజ్‌`లో హాటు హాటు అందాల‌తో అద‌ర‌గొడుతుంటే తదేకంగా  తెర‌నే చూస్తూ క‌ల‌ల్లో విహ‌రించ‌డం కుర్ర‌కారు వంతైంది. తేరుకున్నాక ``ఓహో కాజ‌ల్ ఐటెమ్ గాళ్ అవ‌తార‌మెత్తిందిగా - ఇదంతా ఐటెమ్ పాట మ‌హ‌త్తే``  అని అస‌లు కార‌ణం తెలుసుకున్నారు. అయితే కాజల్ ఐటెమ్ భామ‌గానే కాదు, ఇకపై ప్ర‌తి సినిమాలోనూ గ్లామ‌ర్‌ తో అద‌ర‌గొట్టేయాల‌ని నిర్ణ‌యించుకొన్న‌ట్టుంది. అందుకే హీరోయిన్‌ గా చేసిన `ఖైదీ నంబ‌ర్ 150`లోనూ సోకుల పందేరానికి దిగింది. ప‌క్కా లోక‌ల్ పాట‌లో కంటే ఎక్కువ‌గా న‌డుమందాల్ని చూపించిన‌ట్టుంది.

అందుకు తార్కాణ‌మే ఆన్‌ లైన్‌ లో విడుద‌లైన ఈ ఫొటోలు. అమ్ముడూ... లెట్స్ డు కుమ్ముడూ అని చిరు అన్నాడంటే ఇక కాజ‌ల్ మాత్రం ఊరుకుంటుందా?  గ్లామ‌ర్‌ తో మ‌రింత‌గా కుమ్మేసిన‌ట్టుంది. రంగు రంగుల ఈడ్రెస్సులో కాజ‌ల్ న‌డుమొంపులు కుర్ర‌కారుని కిక్కెచ్చేలా ఉన్నాయి.  తెర‌పై ఆమెని చూస్తే ఇక దిమ్మతిరిగిపోవ‌డం ఖాయ‌మేమో. అన్న‌ట్టు ఇక్క‌డ కాజ‌లే ఐటెమ్ భామ రేంజులో క‌నిపిస్తోంది కాబ‌ట్టి-  ల‌క్ష్మీరాయ్ చేసిన స్పెష‌ల్ ఇంకెంత స్పైసీగా ఉంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News