కాజల్ అగర్వాల్... దశాబ్దం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. బోలెడు అందంతోపాటు కాస్తంత అభినయం కూడా వచ్చి ఉండటం ఆమెకు ప్లస్ పాయింటని చెప్పొచ్చు. అందుకే నిన్న మొన్నటి వరకు భారీ చిత్రమేదైనా సరే హీరోయిన్ గా కాజల్ ఫస్ట్ ఛాయిస్ అన్నట్టుగా ఆమె హవా నడిచింది. దాదాపు అగ్ర హీరోలందరి పక్కన హీరోయిన్ గా నటించింది. అయితే ప్రస్తుతం తన టైం అంతగా బాగున్నట్టు లేదు.
బ్రహ్మోత్సవం సినిమా తర్వాత యంగ్ హీరోల పక్కన కాజల్ కనిపించింది లేదు. జనతా గ్యారేజ్ లో కనిపించినా ఐటం సాంగుకే పరిమితమైంది. లేటెస్ట్ గా ఖైదీ నెంబర్ 150 లో చిరు పక్కన చిట్టి పాత్రలో నటించి మెప్పించింది. ఇందులోనూ ఎప్పటిలాగే అందంగా కనిపించింది. ఈ సినిమా తర్వాత కొత్త అవకాశాలు తలుపు తడతాయని భావించినా అలాంటిదేం జరగలేదు. యంగ్ హీరోలు ఎవరూ ఇప్పడు కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి ఇష్టపడటం లేదని టాలీవుడ్ సమాచారం. ఇదే టైంలో సీనియర్ హీరోలు కాజల్ ను హీరోయిన్ గా తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. హర్రర్ సినిమాలతో హైలైట్ అయిన రాఘవ లారెన్స్ పక్కన హీరోయిన్ గా కాజల్ కు తాజాగా ఛాన్స్ వచ్చింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న బాహుబలి చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథ అందించారని సమాచారం. రాజమౌళి అసిస్టెంట్లలో ఒకరు ఈ చిత్రానికి దర్శకత్వం చేయొచ్చని టాక్. మరి కాజల్ ఈ ప్రపోజల్ ను ఓకే చేస్తుందో లేదో చూడాలి. వెయిట్ అండ్ సీ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/