చందమామ కాజల్‌ నయా గేమ్‌ ప్లాన్‌!

Update: 2015-07-01 07:17 GMT
స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ మనసులో అసలేం ఉంది? మాట తీరులో, నడవడికలో అనూహ్య మార్పొచ్చింది. ఆలోచనల్లో తేడా స్పష్టంగా ఉంది. ఇక ఎప్పటికీ టాలీవుడ్‌కి దూరంగా ఉండబోతోందా? కేవలం కోలీవుడ్‌, బాలీవుడ్‌కి మాత్రమే పరిమితమవ్వాలనుకుంటుందా? కారణాలు వెతికితే బోలెడన్ని ఆసక్తికర సంగతులు తెలిశాయి. కాజల్‌ మనసులో ఏం ఉందో ఫుల్‌ క్లారిటీ వచ్చిందిప్పుడు.

    కాజల్‌ తెలుగు చిత్రసీమను వదిలేయడానికి నాలుగు బలమైన కారణాలున్నాయి. ఒకటి ఇక్కడ స్టార్‌ హీరోలందరితో ఈపాటికే నటించేసింది. దశాబ్ధ కాలం గడుస్తోంది కాబట్టి ఇక మునుపటి క్రేజు ఉండనే ఉండదు. ఇంతకాలం నటించినా తనకి అనుష్క రేంజు గుర్తింపు రానేలేదు. తనకి ఎంతమాత్రం గుర్తింపు లేని క్యారెక్టర్లలో మాత్రమే అవకాశాలొచ్చాయి. మన కథలన్నీ హీరోల చుట్టూ తిరగడం వల్ల హీరోయిన్‌కి నటించే ఆస్కారమే లేదు. అదే కోలీవుడ్‌లో అయితే అలా కాదు. అక్కడ హీరోకి ఎంత ప్రాధాన్యమో.. హీరోయిన్‌కి అంతే ప్రాధాన్యతనిస్తారు. పైగా అక్కడ హీరోలు సెన్సిబుల్‌. ఎంచుకునే స్క్రిప్టులో ఆ విషయం ఉంటుంది. నాయికా ప్రాధాన్యాన్ని ప్రశ్నించరు. మురుగదాస్‌, సుశీంద్రన్‌, బాలాజీ మోహన్‌ లాంటి దర్శకులు తెరకెక్కించే సినిమాల్లో కథానాయికలు హైలైట్‌గా కనిపిస్తారు. అందుకే సెలక్టివ్‌గా తమిళ్‌ నుంచి అవకాశాలు వస్తే వదులుకోవడం లేదు.

    మరో కోణంలో పరిశీలిస్తే .. ఇప్పటికే బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదగాలన్న ఆశ చావలేదు. మాతృపరిశ్రమ హిందీలో ఏనాటికైనా స్టార్‌ హీరోయిన్‌ అవ్వాలన్నది తన కల. దాంతో అక్కడా కొన్ని సినిమాల్లో నటిస్తూ బ్యాలెన్స్‌ చేస్తోంది. ఈ రెండు పరిశ్రమలకు తెలివిగా ప్రాధాన్యతనిస్తోంది. ప్రస్తుతం తమిళ్‌లో మూడు సినిమాలు (మారి, పాయుం పులి, మర్మ ధానం) చేస్తోంది. దో లఫ్జోంకి కహానీ చిత్రంతో బాలీవుడ్‌లో మరోసారి లక్‌ చెక్‌ చేసుకోబోతోంది. అక్కడ విజయాల శాతాన్ని బట్టి ఎక్కడ నటించాలో నిర్ణయించుకోనుంది. అలాగని టాలీవుడ్‌ని పూర్తిగా విడిచిపెట్టినట్టు కాదు. అడపాదడపా స్టార్‌ హీరోల సరసన వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోదు. ఇటీవలే మహేష్‌ బ్రహ్మూెత్సవంలో అవకాశాన్ని పరిశీలించింది. అరుదుగా ఇలాంటి అవకాశాల్ని విడిచిపెట్టకుండానే కొత్త గేమ్‌ ప్లాన్‌ని అమలు చేయనుంది. దటీజ్‌ కాజల్‌ ..

Tags:    

Similar News