ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య విపరీతమైన పోటీ ఉంటుందని.. ఒకరి ఛాన్సులను మరొకరు దక్కించేసుకుంటూ ఉంటారని.. సినిమాలో కనిపించే ఇద్దరు హీరోయిన్ల మాదిరిగానే తెగ ఫైటింగులు చేసుకుంటూ ఉంటారని అనుకోవడం సహజమే. కానీ ప్రొఫెషనల్ గా హీరోయిన్ల మధ్య ఆధిపత్య పోరు ఉన్నా.. కొందరి ప్రవర్తన మాత్రం చాలా నేచురల్ గా.. ఇతరులతో స్నేహం చేసేలానే ఉంటుంది.
హీరోయిన్లతో ఫ్రెండ్షిప్ మెయింటెయిన్ చేయడంలో టాలీవుడ్ చందమామకు ఉన్న గుర్తింపు మరెవరికీ లేదని చెప్పాలి. సహజంగా ఏదైనా సినిమాలో ఫలానా రోల్ చేయమంటూ ఆఫర్ వచ్చినపుడు.. పాత్ర.. పారితోషికం.. డేట్స్.. బ్యాలెన్స్ చేసుకుని నటించడమో మానేయడమో చేస్తారు. కానీ కాజల్ మాత్రం ఇలా కాదు. తను నటించేందుకు ఒప్పుకుంటే ఓకే. లేకపోతే ఆ పాత్రకు ఎవరు సరిపోతారనే అంశంపై కాసింత మేథోమథనం చేసేసి.. ఆయా దర్శక నిర్మాతలకు ఫలానా హీరోయిన్ అయితే కరెక్ట్ అని సలహా ఇస్తుందట. అఫ్ కోర్స్.. తనతో స్నేహితురాళ్ల పేర్లే చెబుతుండి లెండి.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున-నానిలు నటిస్తున్న మూవీలో ఈమెకు హీరోయిన్ ఆఫర్ వచ్చిన సంగతి తెలిసిందే. డేట్స్ కుదరకపోవడంతో.. ఈ పాత్రకు రకుల్ ప్రీత్ సింగ్ అయితే కరెక్ట్ గా ఉంటుందని చెప్పడమే కాదు.. కన్విన్స్ కూడా చేసిందట. మరోవైపు గ్లామర్ డాల్ రోల్స్ కాకుండా.. తన ట్యాలెంట్ చూపించే ఆఫర్స్ కోసం చూస్తున్న రకుల్ కూడా ఈ పాత్రకు వెంటనే సై అనేసిందని తెలుస్తోంది.