మ్యాడ‌మ్ తుస్సాడ్స్ లో చంద‌మామ విగ్ర‌హం

Update: 2019-12-17 08:50 GMT
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్ర‌ముఖ‌ సెల‌బ్రిటీల విగ్ర‌హాల్ని ఆవిష్క‌రిస్తూ మ్యాడ‌మ్ తుస్సాడ్స్ నిర్వాహ‌కులు అభిమానుల‌కు ట్రీటిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు సూప‌ర్ స్టార్ మ‌హేష్ విగ్ర‌హాన్ని సింగ‌పూర్ మ్యాడ‌మ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్క‌రించారు. హైద‌రాబాద్-ఏఎంబీలో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచి అటుపై ఇక్క‌డి నుంచి ఈ విగ్ర‌హాన్ని సింగ‌పూర్ కి త‌ర‌లించ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. అటుపైనా అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి మైన‌పు విగ్ర‌హాన్ని సింగ‌పూర్ తుస్సాడ్స్ లో ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే డార్లింగ్ ప్ర‌భాస్ విగ్ర‌హం మాత్రం బ్యాంకాక్ మ్యాడ‌మ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్క‌రించ‌డం విశేషం. లండ‌న్ లోనూ ప్ర‌భాస్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు.

ఇప్పుడు చంద‌మామ వంతు. 5 ఫిబ్ర‌వ‌రి 2020.. కాజ‌ల్ డే. ఆరోజు సింగ‌పూర్ మ్యాడ‌మ్ తుస్సాడ్స్ లో చంద‌మామ కాజ‌ల్ మైన‌పు విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తుండ‌డం అభిమానుల్ని ఎగ్జ‌యిట్ చేస్తోంది. ఈ సంద‌ర్భంగా మ్యాడ‌మ్ తుస్సాడ్స్ నిర్వాహ‌కులు కాజ‌ల్ ని క‌లిసి కొల‌త‌లు తీసుకున్న‌ప్ప‌టి ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ద‌శాబ్ధాల పాటు ఏజ్ లెస్ బ్యూటీగా సౌత్ లో వెలుగుల్ని ప్ర‌స‌రించిన‌ కాజ‌ల్ కి అరుదైన గౌర‌వ‌మిది. ఈ సంద‌ర్భంగా చంద‌మామ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది.

``నా చిన్న‌త‌నంలో ఓసారి సింగ‌పూర్ మ్యాడ‌మ్ తుస్సాడ్స్ కి వెళ్లాను. మ్యూజియంలో విగ్ర‌హాల్ని చూసి ఎంతో ఎగ్జ‌యిట్ అయ్యాను. వాటితో ప్రేమ‌లోనూ ప‌డ్డాను. ఇప్పుడు అంత‌మంది సెల‌బ్రిటీల్లో నేను కూడా ఒక‌దానిని కావ‌డం చాలా సంతోషంగా ఉంది`` అంటూ ఎగ్జ‌యిట్ అయ్యింది కాజ‌ల్. ఫిబ్ర‌వ‌రి 5 నుంచి ఇద్ద‌రు చంద‌మామ‌ల్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ అభిమానులు క‌నులారా వీక్షించ‌వ‌చ్చ‌న్న‌మాట‌.


Tags:    

Similar News