రానా కోసం గెస్ట్‌ రోల్‌ కు ఓకే చెప్పిందట

Update: 2020-08-06 11:30 GMT
రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంలో కాజల్‌ తో కలిసి నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుండి రానా మరియు కాజల్‌ మంచి స్నేహితులు అయ్యారు. ఆ సమయంలోనే వీరిద్దరు కలిసి మరో సినిమాలో నటిస్తారంటూ ప్రచారం జరిగింది. అది ఇన్నాళ్లకు సెట్‌ అయ్యింది. వీరిద్దరి కాంబోను త్వరలో ప్రేక్షకులు చూడబోతున్నారు. హాతీ మేరీ సాతి చిత్రంలో రానాతో పాటు కాజల్‌ కూడా నటించబోతుందట. అయితే ఈ చిత్రంలో కాజల్‌ ది గెస్ట్‌ రోల్‌ గా చెబుతున్నారు.

సినిమాలోని కీలకమైన గిరిజన యువతి పాత్రకు గాను కాజల్‌ ను ఎంపిక చేశారట. గిరిజన యువతి పాత్ర అవ్వడంతో బ్లౌజ్‌ లేకుండా చీర కట్టుకుతోనే కాజల్‌ కనిపిస్తుందట. దాదాపు ముప్పై నిమిషాల స్క్రీన్‌ ప్రజెన్స్‌ ఉండే కాజల్‌ ఏకంగా 70 లక్షల వరకు పారితోషికం తీసుకుంటుందట. ప్రస్తుతం ఈమె చిరంజీవి ఆచార్యతో పాటు కమల్‌ ఇండియన్‌ 2 వంటి బిగ్గెస్ట్‌ భారీ చిత్రాల్లో నటిస్తుంది. కనుక రానాతో కలిసి నటించేందుకు ఆ మాత్రం డిమాండ్‌ చేయడం కామన్‌. కాజల్‌ కు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో సినిమాకు ఆమె పాజిటివ్‌ గా నిలుస్తుందనే నమ్మకంతో మేకర్స్‌ ఆమెను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.


Tags:    

Similar News