రజినీ రోల్ లో నటిస్తున్న కాజోల్

Update: 2017-07-04 04:37 GMT
రజినీకాంత్ విలన్ గా నటిస్తే ఎలా ఉంటుంది.. కెరీర్ ప్రారంభంలో కొన్ని నెగిటివ్ పాత్రల్లో కనిపించారు రజినీకాంత్. సూపర్ స్టార్ అయిపోయాక మరెప్పుడూ ఆ కోణం వైపు తొంగి చూడలేదు. కానీ ఇప్పుడు రజినీతో విలన్ రోల్ చేయించాలనే ఆలోచన ఒకరికి వచ్చింది. ఎవరికో కాదు.. స్వయంగా ఆయన కూతురు సౌందర్యకే ఈ థాట్ వచ్చింది.

ప్రస్తుతం ధనుష్ హీరోగా సౌందర్య దర్శకత్వంలో వీఐపీ2 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో విలన్ పాత్ర.. అంటే నెగిటివ్ రోల్ లో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ కాజోల్ నటిస్తోంది. నిజానికి ఈ రోల్ ను మొదటగా రజినీకాంత్ ను దృష్టిలో ఉంచుకునే రాశారట. విలన్ పాత్ర చేయాల్సిందిగా తండ్రిని కోరిందట సౌందర్య. అయితే.. పలు రకాల ఆలోచనల తర్వాత.. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ కారణాలతో ఈ పాత్ర తాను చేయబోనని తేల్చేశారట రజినీకాంత్. ధనుష్ కి విలన్ గా రజినీకాంత్ ను చూపించాలన్న ఆలోచన.. అలాగే సూపర్ స్టార్ ని నెగిటివ్ రోల్ లో చూసే అవకాశం అలా మిస్ అయిపోయాయి.

ఈ పాత్రను చేయనని రజినీకాంత్ చెప్పిన తర్వాతే.. ఈ రోల్ ను కాజోల్ కు ఆఫర్ చేశారని తెలుస్తోంది. ఆమెకు తగినట్లుగా స్క్రిప్ట్ లో పలు మార్పులు చేశారట. వీఐపీ2లో కాజోల్ చేస్తున్న పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందనే విషయం.. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. తమిళ్ తో పాటు.. తెలుగు.. హిందీలో కూడా ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News